TTD: చాగంటి కోటేశ్వరరావు సంచలన నిర్ణయం, టీటీడీ పదవి నిరాకరణ
Chaganti Koteswara Rao rejected TTD advisor Post
ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ ధర్మప్రచార పరిషత్ సలహాదారు పదవిని చాగంటి కోటేశ్వరరావు తిరస్కరించారు. టీటీడీకి సలహాలు ఇవ్వడానికి నాకు పదవులు అవసరం లేదని స్పష్టం చేశారు.నా ఊపిరే వేంకటేశ్వరస్వామి అని, టీటీడీకి నా అవసరం అనిపించినప్పుడు తప్పకుండా ముందు వుంటానని చాగంటి కోటేశ్వరరావు తెలిపారు.
కొన్ని వారాల క్రితం టీటీడీ సలహాదారుగా చాగంటి
ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా కొన్ని వారాల క్రితం నియమితులయ్యారు. చాగంటి కోటేశ్వరరావుని సలహాదారుగా నియమిస్తూ హెచ్డీపీపీ కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల కోసం మూడేళ్లుగా వివిధ పారాయణాలను నిర్వహిస్తున్న టీటీడీ ఈ కార్యక్రమాలను మరింత ముందుకి తీసుకెళ్లేందుకు చాగంటిని సలహాదారుగా నియమించింది.