2014–15లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన సమయంలో రెవిన్యూ లోటు రూ.22,948.76 కోట్లుగా కాగ్ అంచనా వేసింది. అప్పటినుండి 2014లో తొలి విడతగా రూ.2303 కోట్లు విడుదల చేసింది.
Andhrapradesh: 2014–15లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన సమయంలో రెవిన్యూ లోటు రూ.22,948.76 కోట్లుగా కాగ్ అంచనా వేసింది. అప్పటినుండి 2014లో తొలి విడతగా రూ.2303 కోట్లు విడుదల చేసింది. ఆ తరువాత 2015లో మరో రూ. 500 కోట్లు, 2016లో రూ.1176.50 కోట్లు వెరసి మొత్తం రూ.3979.50 కోట్లు ఇచ్చింది. మిగతా మొత్తాన్ని తర్వాత విడుదల చేస్తామని చెప్పిన కేంద్రం, ఇంకా రూ.139.39 కోట్లు మాత్రమే ఇవ్వాలని ఆ తరువాత వెల్లడించింది. మిగిలిన మొత్తాన్ని కొత్త పథకాల కోసం ఖర్చు చేశామని 2017 లో అప్పటి ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.
తాజాగా ఏపీ కి కేంద్రం కాసుల పంట కురిపించింది. 2014 -2015 కింద రెవెన్యు లోటు కింద కేంద్రం 10 ,460 కోట్లు ఇచ్చింది. ఇది ప్రత్యక సాధారణ ఆర్థిక సాయం కింద ఈ మొత్తాన్ని మంజూరు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మహేంద్ర ఈనెల 19 న
ఆదేశాలిచ్చారు. ఈ నిధుల్ని వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విడుదలచేయాలని ఆయన అధికారులకు సూచించారు. 2018 లో అప్పటి ఏపీ గవర్నమెంట్ కేంద్రానికి రెవెన్యూలోటు బడ్జెట్ పై ఎన్నోసార్లు వినతి పత్రాలు రాసింది. అయితే ఇప్పడు ఈ విషయంపై సీఎం జగన్ చాలాసార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ ని అలాగే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కలిసి సకాలంలో నిధులు విడుదల చేసి రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తోడ్పాటు అందించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఎట్టకేలకు కేంద్రనుండి రాష్టానికి నిధులు విడుదలయ్యాయి. ఎప్పుడైనా కేంద్రనుండి విడతల వారీగా నిదులని విడుదల చేస్తుంది. కానీ ఇంతపెద్ద మొత్తంలో ఒకేసారి నిధులను విడుదల చేయడం ఇదే మొదటిసారని ఏపీ ఆర్థిక శాఖ అధికారులంటున్నారు.