Central Ministers: విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుకు కేంద్ర మంత్రులు
Central Ministers: విశాఖలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుకు పలువురు కేంద్ర మంత్రులు తరలి రానున్నట్లు తెలుస్తోంది. అలాగే 26 దేశాల విదేశాంగ ప్రతినిధులు కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. యూరోపియన్ యూనియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ఇప్పటికే ప్రభుత్వానికి సమాచారం అండగా యూరోపియన్ యూనియన్ చాంబర్ ప్రతినిధులు రావడం కీలక పరిణామంగా భావిస్తోంది ప్రభుత్వం. ఇక దాదాపుగా కేంద్రమంత్రులు షెడ్యూల్ ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ సమ్మిట్ కు నితిన్ గడ్కరీ, జి కిషన్ రెడ్డి, పీయూష్ గోయల్, శరబానంద సోనోవాల్, రాజీవ్ చంద్రశేఖర్ రానున్నట్టు తెలుస్తోంది. మరోపక్క విశాఖ ఎయిర్ పోర్టు ఇన్ ఛార్జి రాజా రమణ్ మాట్లాడుతూ జిఐఎస్ సమ్మిట్ లో పాల్గొనేందుకు 300 మంది వివిఐపిలు ఈ రెండు రోజులు విశాఖ ఎయిర్ పోర్టుకు రాబోతున్నారని, అంబానీ, అదానీ, మిట్టల్ లాంటి ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ప్రత్యేక విమానాలలో వస్తున్నారని అన్నారు.
ఈ రెండు రోజులు 16 ప్రత్యేక విమానాలు వస్తున్నాయన్న ఆయన ఎయిర్ ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నామని, నేవీ అధికారులతో కూడా మాట్లాడామని అన్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు సీఎం వైఎస్ జగన్ విశాఖ ఎయిర్ పోర్ట్ కి చేరుకుంటారని అన్నారు. ఈ రోజు రాత్రి 7 గంటలకు జిఎంఆర్ టీం రాబోతున్నారని, రేపు ఉదయం నుంచి ప్రత్యేక విమానాలలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు వస్తారని అన్నారు. అతిధులకి ఇబ్బందులు రాకుండా రెవెన్యూ, పోలీస్, ప్రోటోకాల్ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని అన్నారు.