Amaravati:అమరావతిలో కేంద్ర సంస్థల భూముల్లో పనులు ప్రారంభం… రైతులకు కేంద్ర మంత్రి హామీ
Central Minister on Amaravati Farmers: కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పరివార్ అమరావతి ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె అమరావతి రైతులతో మాట్లాడారు. అమరావతి రాజధాని ఏర్పాటుపై రైతులు ఆమెతో చర్చించారు. కాగా, తాను మరో పదిరోజుల్లో రాజధాని ప్రాంతంలో పర్యటిస్తానని హామీ ఇచ్చారు. అమరావతిలో కేంద్ర సంస్థలకు ఇచ్చిన భూముల్లో వెంటనే పనులు ప్రారంభించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని రైతులు ఆయన్ను కోరారు. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కూడా ఆమె హమీ ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వానికి కేటాయించిన భూముల్లో కేంద్ర సంస్థల నిర్మాణానికి శ్రీకారం చుడితే రాష్ట్రప్రభుత్వం మూడు రాజధానుల అంశం పక్కనపెట్టే అవకాశం ఉంటుందని రైతులు చెబుతున్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా చొరవ తీసుకోవాలని, అప్పుడే రాజధాని పనులు వేగవంతం అవుతాయని రైతులు చెబుతున్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం దీనికి విరుద్ధంగా అడుగులు వేస్తున్నది. మూడు రాజధానులకు కట్టుబడి ఉంటామని, మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులను కూడా ఏర్పాటు చేస్తామని చెబుతున్నది. రాబోయే మూడు నాలుగు నెలల కాలంలో పరిపాలన రాజధాని విశాఖ నుండి పనులు ప్రారంభమయ్యేలా చూస్తామని వైసీపీ ప్రభుత్వం చెబుతున్నది.