Vizag Steel Wheel Plant: అమ్మకానికి విశాఖ ఉక్కు వీల్ ప్లాంట్
Central Govt to Sell Vizag Steel Wheel Plant: విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని విక్రయించేందుకు కేంద్రం చకచకా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా మొదట విశాఖ ఉక్కుకు అనుబంధంగా ఉన్న కంపెనీలను విక్రయించేందుకు సిద్ధమౌతున్నది. ఇందులో భాగంగానే మొదట ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో ఉన్న ఫోర్జ్‌డ్ వీల్ ఫ్యాక్టరీని విక్రయించేందుకు సిద్ధమైంది. ఈ ఫ్యాక్టరీ విలువ రూ. 1900 కోట్లు ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాగా, గతేడాది సెప్టెంబర్‌లో విక్రయానికి బిడ్డింగ్‌లను పిలువగా రెండు ప్రైవేటు కంపెనీలు ఆసక్తి కనబరిచినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ కంపెనీలను ప్రైవేట్ పరం చేరేందుకు కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. ఈ ఫ్యాక్టరీలలో పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నది.
కాగా, విశాఖ ను విక్రయించాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. రైల్ చక్రాలను తయారు చేసేందుకు రాయ్‌బరేలీలో ఫోర్జ్‌డ్ వీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది. 2013లో అప్పటి యూపీయే ప్రభుత్వం దీనిని ఏర్పాటు చేసింది. అయితే, 42 నెలల కాలంలో ఫ్యాక్టరీని నిర్మించాలని అనుకున్నా అనేక కారణాల వలన ఆలస్యం అయింది. 2021 సెప్టెంబర్ నెలలో ఈ ప్లాంట్ నిర్మాణం పూర్తయింది. ఈ ప్లాంట్ నిర్మాణం అనంతరం కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. కాగా, ఈ ఫ్యాక్టరీ నుండి ఇప్పటి వరకు 1400 లోకోమోటీవ్, 2000 ఎల్‌బీహెచ్ చక్రాలను తయారు చేసింది.