కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 22వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.
YS Avinashreddy: కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 22వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ నెల 19వ తేదీన హాజరు కావాల్సి ఉండగా అవినాష్ రెడ్డి తల్లి అస్వస్థతకు గురి కావడంతో ఆయన ఆసుపత్రిలో ఉండి ఆమె బాగోగులను చూసుకుంటున్నారు. ఇదే విషయాన్ని సీబీఐ అధికారులకు అవినాష్ రెడ్డి న్యాయవాదులు తెలిపారు. వెంటనే కారులో పులివెందులకు బయలుదేరి వెళ్లిపోయారు. తల్లి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కర్నూలులో చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం అవినాష్ కూడా కర్నూలులోనే ఉన్నారు. కాగా ఈ విషయం తెలుసుకున్న సీబీఐ అధికారులు నిన్న కర్నూల్‌కు వెళ్లారు. ఈక్రమంలో మరోసారి విచారణకు హాజరుకావాలంటూ వాట్సప్ ద్వారా అవినాష్ రెడ్డికి నోటీసులు పంపించారు. 22వ తేదీన ఉదయం పదకొండుగంటలకు విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు.
ఎనిమిదో సారి ఆయన విచారణను ఎదుర్కోనున్నారు, వైఎస్ వివేకా హత్య కేసులో ఇప్పటికే వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అప్పటినుండి అవినాష్ అరెస్ట్ తప్పదని ప్రచారం కూడా జరుగుతుంది. అయితే వైఎస్ అవినాష్ రెడ్డి ఎల్లుండి సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరవుతారా? లేదా? అన్నది చూడాలి. రెండు సార్లు విచారణకు డుమ్మా కొట్టిన అవినాష్ ఈసారైనా విచారణకు వస్తారా అనేది ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ విచారణకు రాకపోతే సీబీఐ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేదానిపై ఇప్పుడు ఉత్కంతంగా మారింది.