Avinash reddy: వైఎస్ వివేకా మర్డర్ కేసుకు సంబంధించి కడప ఎంపీ అవినాష్ రెడ్డి (Avinash reddy), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కి మధ్య నోటీసులు, లేఖల పర్వం కొనసాగుతోంది. సీబీఐ మరోసారి అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈనెల 19న విచారణకు హాజరు కావాలని పేర్కొంది.
Avinash reddy: వైఎస్ వివేకా మర్డర్ కేసుకు సంబంధించి కడప ఎంపీ అవినాష్ రెడ్డి (Avinash reddy), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కి మధ్య నోటీసులు, లేఖల పర్వం కొనసాగుతోంది. సీబీఐ మరోసారి అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈనెల 19న విచారణకు హాజరు కావాలని పేర్కొంది. హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసుల్లో పేర్కొంది. అవినాష్ రెడ్డి హైదరాబాద్ నుంచి కడప వెళ్తుండగా.. సీబీఐ వాట్సాప్ ద్వారా నోటీసులు పంపించింది.
ముందుగా సోమవారం సీబీఐ అవినాష్ రెడ్డికి నోటీసులు పంపించింది. మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈక్రమంలో హైదరాబాద్‌కు వచ్చిన అవినాష్ రెడ్డి.. విచారణకు హాజరు కాలేనని సీబీఐకి లేఖ రాశారు. అవిషార్ట్ నోటీసులు అని.. మంగళవారం విచారణకు హాజరు కావాలని అవినాష్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. తనకు పార్టీ కార్యక్రమాలతో పాటు, ముందుగా అనుకున్న ఇతర పనులు ఉండడంతో నాలుగైదు రోజుల సమయం కావాలని సీబీఐని కోరారు. అయితే అవినాష్ రెడ్డి రాసిన లేఖ పట్ల సీబీఐ సానుకూలంగా స్పందించింది. అలాగే ఈనెల 19న విచారణకు హాజరు కావాలని తిరిగి నోటీసులు పంపించింది. మరోవైపు వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి అనుచరులు సీబీఐ విచారణకు హాజరయ్యారు. నాగెళ్ల విశ్వేశ్వర రెడ్డి, వర్రా రవీంద్రా రెడ్డి, శ్రీకాంత్‌లు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.
అయితే అంతకముందు ఐదుసార్లు సీబీఐ అవినాష్ రెడ్డిని విచారించింది. అటు ఆయన తండ్రి వైఎస్ భాస్కరరెడ్డిని కూడా సీబీఐ అరెస్ట్ చేసింది. ఈక్రమంలో అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారని అందరూ భావించారు. అటు అవినాష్ రెడ్డి కూడా ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు మాత్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ఎటువంటి ఆటంకాలు లేకపోయినప్పటికీ సీబీఐ మాత్రం ఆచీ తూచీ అడుగులేస్తుంది. ఇక తాజాగా మళ్లీ నోటీసులు ఇవ్వడంతో అరెస్ట్‌పై ఊహాగానాలు మొదలయ్యాయి.