Avinash Reddy: సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో (Viveka murder case) కీలక పరిణామం చోటుచేసుకుంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి (MP Avinash reddy) మరోసారి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) నోటీసులు ఇచ్చింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
Avinash Reddy: సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో (Viveka murder case) కీలక పరిణామం చోటుచేసుకుంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి (MP Avinash reddy) మరోసారి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) నోటీసులు ఇచ్చింది. మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. దీంతో అవినాష్ రెడ్డి కడప నుంచి హైదరాబాద్కు బయల్దేరారు. సోమవారం ఉదయమే అవినాష్ రెడ్డి హైదరాబాద్ నుంచి కడప వెళ్లారు. అయితే మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేయడంతో తిరుగు పయనమయ్యారు.
అవినాష్ రెడ్డిని ఇప్పటి వరకు సీబీఐ ఐదుసార్లు విచారించింది. తాజాగా ఆరోసారి విచారణకు హాజరుకావాలని 160 సిఆర్పిసి కింద మరోసారి నోటీసులు జారీ చేసింది సీబీఐ. గతంలో విచారించిన సమయంలోనే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని అందరూ భావించారు. కానీ సీబీఐ అరెస్ట్ చేయలేదు. ఈక్రమంలో మరోసారి విచారణకు హాజరుకావాలని ఆదేశించడంతో.. ఉత్కంఠ నెలకొంది. అవినాష్ రెడ్డిని సీబీఐ ఏయే ప్రశ్నలు అడగనుంది?.. ఈసాని అరెస్ట్ చేస్తుందా?.. లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.
ఇకపోతే గతనెలలో అవినాష్ రెడ్డి తండ్రి.. వైఎస్ భాస్కర్ రెడ్డిని (Bhaskar reddy) సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పులివెందులలోని వారి ఇంటికి వెళ్లి విచారించిన సీబీఐ అనంతరం అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలించింది. ఆయనతో పాటు అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని కూడా సీబీఐ అదుపులోకి తీసుకుంది. వారిని కోర్టులో హాజరుపర్చగా.. న్యాయస్థానం రిమాండ్ విధించింది. మరోవైపు వివేకా మర్డర్ కేసులో అరెస్ట్ అయిన ఉదయ్ కుమార్ రెడ్డికి కోర్టులో చుక్కెదురయింది. బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టిపారేసింది. ఈ నేపథ్యంలో ఇవాల్టి విచారణ ఉత్కంఠగా మారింది.