జిల్లాల పునర్విభజనపై డ్రాప్ట్‌కు కేబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనపై సిద్ధమైన ఫైనల్ డ్రాప్ట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. వర్చువల్ భేటీ అయిన మంత్రి వర్గం డ్రాప్ట్‌కు ఆమోద ముద్ర వేసింది. భువనేశ్వర్ పర్యటనలో ఉన్న గవర్నర్ ఏపీకి రాగానే ఈ ఆర్డినున్స్‌ను గవర్నర్ వద్దకు తీసుకెళ్లాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో 26 జిల్లాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లైంది.
26 జిల్లాల్లో 70 రెవెన్యూ డివీజన్లను ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. కొత్తగా మన్యం జిల్లా, అల్లూరి జిల్లా, అనకాపల్లి, కోనసీమ, రాజమండ్రి, నరసాపురం, బాపట్ల, నర్సరావుపేట, తిరుపతి, అన్నమయ్య, నంద్యాల, సత్యసాయి, ఎన్టీఆర్ విజయవాడ జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది ప్రభుత్వం. మరోవైపు రెవెన్యూ డివీజన్‌గా కుప్పం, పలాస, బొబ్బిలి, చీపురుపల్లి, భీమిలీ, కొత్తపేట, భీమవరం, ఉయ్యూరు, తిరువూరు, నందిగామ, బాపట్ల, చీరాల, సత్తెనపల్లి, ఆత్మకూర్, డోన్, గుంతకల్, ధర్మవరం, పుట్టపర్తి, రాయచోటి, పలమనేరు, నగరి, శ్రీకాళహస్తి ను రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం