Byreddy Siddharth Reddy: బీఆర్ఎస్ పై బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Byreddy Siddharth Reddy: బీఆర్ఎస్ పై పలు వ్యాఖ్యలు చేసారు వైస్సార్సీపీ ఎమ్మెల్యే , శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. బిఆర్ఎస్ పార్టీ పేరుతో కెసిఆర్ ఏపీలో అడుగుపెడితే ఏమిచేయలేదని అన్నారు. అదే జగన్ తెలంగాణలో ప్రవేశిస్తే ఎవరు తట్టుకోలేరని అన్నారు. తెలంగాణ రాజకీయాల్లో భూకంపాలు వస్తాయని వ్యాఖ్యానించారు. జగన్ అధికారంలో ఉన్నా, లేకపోయినా ఆయన కోసం స్పందించే కోట్లాది మంది అభిమానులున్నారన్నారు. జగన్ కు ప్రత్యేకంగా ప్రైవేటు సైన్యం ఉందని వ్యాఖ్యానించాను. ఆయన తెలంగాణాలో పోటీచేస్తే ఫ్యాన్ గాలికి కారు కొట్టుకుపోతుందన్నారు.
తెలంగాణలో జగన్ కోసం ప్రతిఉళ్ళో,నగరాల్లో వాడవాడల అభిమానులు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ వస్తుంది, పొడిచేస్తుంది, ఎదో చేస్తుందని అంటూ తెలంగాణ మంత్రులు కూడా మాట్లాడుతున్నారు. వాళ్లు ఇక్కడికి వచ్చి ఏం పొడుస్తారో తెలీదు కానీ.. జగన్ తెలంగాణ రాజకీయాల్లో వేలుపెడితే మాత్రం అక్కడి ప్రభుత్వాలే తలకిందులవుతాయి అని బైరెడ్డి కామెంట్స్ చేసారు. విశాఖలో సభ పెట్టుకుంటే ప్రజలు ఎవరు రారన్నారు.
అలాగేబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పవన్ కళ్యాణ్ పై కూడా పలు కామెంట్స్ చేసారు. జనసేన వాళ్లకి 175 నియోజకవర్గాల పేర్లు తెలుసా? అని ప్రశ్నించారు. హైపర్ ఆది లాంటి వాళ్లు తాము ఎలాంటి నాయకుల కింద పనిచేస్తున్నామో గుర్తించాలని అన్నారు. మా పార్టీలో ఉన్నప్పుడు పవన్ కల్యాణ్ ను బూతులు తిట్టి, ఇప్పుడు పవన్ కల్యాణ్ పార్టీలోకి వెళ్లి మమ్మల్ని బూతులు తిట్టేవాళ్లను కూడా చూశాం అని పేర్కొన్నారు. మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేసాడు.