Buggana: బడ్జెట్ మీద చర్చ జరుగుతుంటే ఎవరైనా ఇలా అల్లరి చేసి వెళ్ళిపోతారా?
Buggana Rajendranath: అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ పై సమాధానం ఇస్తున్న ఆర్ధిక మంత్రి బుగ్గన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మీద సెటైర్లు వేశారు. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ తాను ఇంకా భోజనం చేయలేదని కానీ టిడిపి వాళ్లు శుభ్రంగా భోంచేసి పడుకొని ఉంటారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర బడ్జెట్ మీద చర్చ జరుగుతుంటే ఎవరైనా ఇలా అల్లరి చేసి వెళ్ళిపోతారా అని ఆయన ప్రశ్నించారు. అసలు అయినా 35 ఏళ్ల వయసులో ఎవరైనా ఆటో బయోగ్రఫీ రాసుకుంటారా? కానీ చంద్రబాబు మనసులో మాట అనే పేరుతో రాసుకున్నాడు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అలా రాసుకున్నప్పటి నుంచి అల్లాడిపోతున్నాడని మనం పుస్తకం తీయడం చదవడం కూడా తప్పేనని అర్థం వచ్చేలా ఆయన కామెంట్ చేశారు. ఆ పుస్తకంలో ఉచిత సేవల కాలం పోయింది, ఇప్పుడు ప్రజల నుంచి డబ్బు సేకరించాలి అని చంద్రబాబు పుస్తకంలో రాశాడన్న ఆయన రెండు రూపాయల బియ్యం ఇచ్చినా ఎన్టీఆర్ ఓడిపోయారు అని రాశాడని అన్నారు. అలాగే ప్రాజెక్టులు కడితే లాభం లేదు అని కూడా చంద్రబాబు రాశాడని, 60 శాతం ఉద్యోగులు అవినీతి పరులే అన్నాడని అంటూ పాత విషయాలను మరోసారి తెర మీదకు తెచ్చే ప్రయత్నం చేశారు అంతేగాక టీడీపీ మాటర్ వీక్….పబ్లిసిటీ పీక్ అని బుగ్గన కామెంట్లు చేశారు.