Buggana: టీడీపీ వాయిదా తీర్మానంపై బుగ్గన ఫైర్
Buggana fires on the adjournment Motion of TDP
ఏపీ అసెంబ్లీలో గందరగోళం కొనసాగుతోంది. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనల వివరాలు సభ ముందు ఉంచాలంటూ టీడీపీ ఎమ్మెల్యేల వాయిదా తీర్మానం నోటీసు ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం పై పట్టుబట్టిన టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. స్పీకర్ పై కాగితాలు చల్లారు. సీఎం ఢిల్లీ పర్యటన వివరాలు చెప్పాలని పోడియం దగ్గర నినాదాలు చేస్తున్నారు. సంయమనం పాటించిన స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగిస్తున్నారు.
ఏం తిన్నారో అని కూడా వాయిదా తీర్మానం ఇస్తారేమో
అసెంబ్లీలో టీడీపీ సభ్యుల తీరును శాసన సభ వ్యవహారాల మంత్రి బుగ్గన తప్పు పట్టారు. సీఎం పర్యటన పై ఎవరైనా వాయిదా తీర్మానం ఇస్తారా? అంటూ నిలదీశారు. వాయిదా తీర్మానం అంటే టీడీపీ సభ్యులకు అర్థం తెలుసా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలోనే కాదు దేశ చరిత్రలోనే ఎవరూ ఒక ముఖ్యమంత్రి పర్యటన గురించి ఇలా వాయిదా తీర్మానం ఇచ్చి ఉండరని బుగ్గన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రేపు బ్రేక్ ఫాస్ట్ లో ఏం తిన్నారో కూడా వాయిదా తీర్మానం ఇస్తారేమో అని ఎద్దేవా చేశారు.