Botsa: బీసీలకు జరిగిన అన్యాయం అప్పుడెందుకు గుర్తురాలేదు, పవన్ కు బొత్స సూటి ప్రశ్న
Botsa Satya Narayana counter attack on Pawan Kalyan
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలను తప్పుబట్టారు. జగన్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే తాపత్రయంతో బురదజల్లే ఆలోచనలో పవన్ కళ్యాణ్ వున్నారని బొత్స అన్నారు. మూడ్ వచ్చినప్పుడు మాట్లాడే నాయకుడు పవన్ కళ్యాణ్…..ఆయన వైఖరి చూస్తుంటే జా లేస్తోందని బొత్స అన్నారు.
నిర్దిష్టమైన లక్ష్యం ఉంటే నీతి., నిజాయితీ తో పోరాడాలని బొత్స హితవు పలికారు. ఆ విధంగా చేస్తే ఏ 30 ఏళ్లకో అవకాశం వస్తుందని… అప్పుడు వరకు ఎన్ని చేసిన వేస్ట్ అని బొత్స అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లోకి వచ్చి టాటా., బిర్లాల మాదిరిగా ఎక్కడ ఎదిగిపోయానో పవన్ కళ్యాణ్ చెప్పగలరా….? అని బొత్స ప్రశ్నించారు.
బలహీన వర్గాలకు భ్రాండ్ అంబాసిడర్ లాంటి పార్టీ వైసీపీ అని బొత్స అన్నారు. బీసీలు మా ప్రభుత్వానికి,పార్టీకి బ్యాక్ బోన్ అని ముఖ్యమంత్రి బహిరంగంగానే చెప్పారని బొత్స అన్నారు. పక్క రాష్ట్రంలో బీసీలకు జరుతున్న అన్యాయంపై పవన్ ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. నా కంటే ముందు తూర్పు కాపు కులంలో చాలా మంది మంత్రులు చేశారు…..నేను వ్యక్తిగతంగా ఎంత అభివృద్ధి చెందానో పవన్ కళ్యాణ్ చెప్పాలని బొత్స సవాలు విసిరారు. వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. గంటకో కులం అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని బొత్స విమర్శించారు.
కులం,మతం అనేది సమాజంలో ఒక భాగమైపోయిందని..నేను కాపు కులంలో పుట్టి రాజకీయంగా ఎదిగానని ధైర్యంగా చెప్పుకుంటానని స్పష్టం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో నేను ఉన్నానని చెప్పుకునే ప్రయత్నంలో మా లాంటి వాళ్ళ పేర్లు పవన్ కళ్యాణ్ ఉటంకిస్తుంటారని బొత్స అన్నారు. నాయకత్వం వహిస్తున్నవాళ్ళు., రాజకీయ లక్ష్యం ఉన్న వాళ్ళు రాజకీయ అవగాహన., అసెంబ్లీ జరిగే విధానం తెలుసుకోవాలని హితవు పలికారు. టీడీపీతో భాగస్వామిగా ఉన్నప్ఫడు బీసీలకు జరిగిన అన్యాయం పవన్ కళ్యాణ్ కు గుర్తు రాలేదా అని ప్రశ్నించారు.