Chandrababu: టూర్లో అపశృతి.. నదిలో పడిన టీడీపీ నేతలు
Boat accident to chandrababu: కోనసీమ జిల్లాలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పర్యాటనలో అపశృతి చోటు చేసుకుంది. రాజోలు మండలం సోంపల్లి రేవులో బోటు దిగుతుండగా చంద్రబాబుకు తృటిలో ప్రమాదం తప్పింది. 15 మంది టీడీపీ నేతలు, ఇతరులు నీటిలో పడగా నీటిలో పడడంతో మాజీ మంత్రి దేవినేని ఉమా, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, పోలీసు అధికారులు, తడిసి ముద్దయ్యారు. కానీ ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని, అందరూ సురక్షితంగానే ఉన్నారని తెలుస్తోంది. ఇక రెండు పడవలు ఢీకొన్న క్రమంలోనే టీడీపీ నేతలు గోదావరిలో పడ్డారని అంటున్నారు. గోదావరిలో దేవినేని ఉమ, ఉండి ఎమ్మెల్యే రామరాజు, తణుకు మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ, సత్యనారాయణ తదితరులు పడిపోవడంతో తడిసి ముద్దయ్యారు.