Andhra Pradesh: జనసేనతో పొత్తు విషయంలో బీజేపీ క్లారిటీ, మరికొన్ని గంటల్లో ప్రకటన
BJP to go it alone in Andhra Pradesh, announcement soon
ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలు స్పష్టమైన వైఖరితో ముందుకు వెళుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాయి. ముందస్తు వ్యూహాలతో ఎన్నికలకు సంసిద్ధం అవుతున్నాయి. పార్టీ కేడర్ ను బలోపేతం చేసుకుంటున్నాయి. తాజాగా ఏపీ బీజేపీ వైఖరిలో మార్పులు వస్తున్నట్లుగా స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. జనసేన పార్టీతో పొత్తు విషయంలో బీజేపీ ఏ విధమైన వైఖరి అవలంభించనుందో కొన్ని గంటల్లో తేలిపోనుంది. జనసేన విషయంలో గతానికి భిన్నంగా తమ వైఖరి ఉందని ఏపీ బీజేపీ నేతలు కొందరు చెబుతున్నారు.
నేడు భీమవరంలో జరిగే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో పొత్తుల విషయంలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు ఇన్ చార్జ్ సునీల్ దేవ్ ధర్ హాజరు కానున్నారు. పొత్తుల విషయంలో పార్టీ అభిప్రాయం వెల్లడించనున్నారు. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశంలో పార్టీతో కాస్త ఎక్కువు మొగ్గు చూపుతున్నారు. టీడీపీతో అంటీముట్టనట్లు ఉంటున్న బీజేపీ పవన్ వైఖరితో అసంతృప్తిగా ఉంది.
పవన్ కళ్యాణ్ టీడీపీకి దగ్గర కావడం బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టం లేదు. భీమవరంలో జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేయనున్నారు. జనసేనతో పొత్తు ఉన్నా లేకున్నా మంచిదే అనే సంకేతాలు అధియాకత్వం పంపనున్నట్లు తెలుస్తోంది. ఒంటరిపోరుకైనా సిద్ధపడాలని రాష్ట్ర నాయకత్వానికి కేంద్ర పార్టీ స్పష్టమైన సంకేతాలు పంపనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి మురళీధరన్ పొత్తలు విషయంలో కేంద్ర నాయకత్వ సందేశాన్ని రాష్ట్ర పార్టీ నాయకులకు వినిపించనున్నారు.