BJP Vs JSP: పొత్తులో ఉన్నా ఇదేం పని.. జనసేనపై బీజేపీ గుస్సా?
BJP Vs JSP: ఆంధ్రప్రదేశ్లో బిజెపి, జనసేన మధ్య పొత్తు ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఈ పొత్తు వ్యవహారం మాత్రం విచిత్రంగా మారిపోయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే 2019 ఎన్నికలు ముగిసిన కొన్నాళ్లకి రెండు పార్టీలు పొత్తులోకి వెళ్లాయి. తర్వాత రెండు పార్టీల మధ్య దూరం పెరిగింది, మళ్లీ కలిశారు అగ్ర నేతలు సమావేశాలు అయ్యారు. ఇంత జరిగినా ఇప్పుడు మళ్ళీ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవవరిస్తూ ఉండడం కోసం వ్యవహారం ఏపీ బీజేపీ సహా జనసేన నాయకులకు కూడా ఏమాత్రం రుచించడం లేదని అంటున్నారు. 2024 ఎన్నికల్లో జనసేన బీజేపీలు కలిసి పోటీ చేస్తాయని ఒకపక్క ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమిరాజు ప్రకటనలు చేస్తున్నా ఈ విషయం మీద జనసేన మాత్రం వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది.
ప్రస్తుతం ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి జరుగుతుంటే జనసేన ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండడమే కాదు తమ నేతలను నచ్చిన అభ్యర్థులకు ఓటు వేసుకోమని అర్హులైన వారిని గెలిపించమని కోరడం చర్చనీయమషం అవుతోంది. అసలు విషయం ఏమిటంటే ఇక్కడ ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. ముఖ్య నేతలు అని భావిస్తున్న వారందరూ బరిలో దిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో బీజేపీ అభ్యర్థులకు జనసేన మద్దతు ప్రకటించాల్సింది పోయి ఎవరు అర్హులు అయితే వారిని గెలిపించమని కోరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతేకాక వైసిపి అభ్యర్థులను ఓడించాలని కోరారు తప్ప ఎవరిని గెలిపించాలని బిజెపి వారికి మద్దతు ఇవ్వాలని కోరలేదు.
ఈ నేపథ్యంలో జనసేన నేతల వ్యవహారం విషయంలో ఏపీ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని జనసేన చీఫ్ దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ముగ్గురు అభ్యర్థులు పోటీకి దిగారు. ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ రాయలసీమ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురిని గెలిపిస్తానంటూ కాళ్లకు బలపాలు కట్టుకుని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఒక్కరే ప్రచారం నిర్వహిస్తున్నారు కానీ ఈ జనసేన మాత్రం ఈ ప్రచారానికి, బీజేపీ అభ్యర్థులకు మద్దతు పలికే విషయానికి రెండిట్లోనూ దూరంగానే ఉంది. దీంతో జనసేన వ్యవహారం మీద బీజేపీ నేతలు మండిపడుతున్నారు, ఒక పక్క మాతో పొత్తులో ఉంటూనే తమకు సహకారం అందించకపోతే ఎలా అంటూ జనసేన వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయంలో జనసేన నాయకుల్లో కూడా కొంత అయోమయం నెలకొందని ఎందుకంటే వైసీపీ అభ్యర్థులకు ఓటు వేయిద్దని చెప్పారు కానీ ఎవరికి ఓటు వేయాలనే విషయం చెప్పకపోవడంతో వారిలో కూడా కొంత గందరగోళం నెలకొందని, మౌఖికంగా నచ్చిన అభ్యర్థులకు ఓట్లు వేసుకోమని జనసేన చెప్పినట్లుగా ప్రచారం జరుగుతున్నా ఏదో ఒక విషయాన్ని అధికారికంగా చెబితే తప్ప ఈ విషయంలో కొంత సందిగ్ద పరిస్థితులు క్లియర్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. చూడాలి మరి ఈ పరిస్థితి ఎక్కడ వరకు దారి తీయబోతోంది అనేది.