Bhogi Festival : తెలుగు రాష్టాల్లో భోగి సంబరాలు
Bhogi Festival: భోగి సంబరాలు తెలుగు రాష్టాల్లో ఘనంగా మొదలయ్యాయి. ఎక్కడిక్కడ పెద్దఎత్తున భోగీ మంటలు వేస్తూ సాంప్రదాయాన్ని చాటుతున్నారు. వేకువజామున అన్ని వీధుల్లోనూ భోగి మంటలు వేసి సాంప్రదాయబద్దంగా గంగిరెద్దులు, కొమ్మదాసరి, హరిదాసు తదితరులను సత్కరించి వారిచే సంక్రాంతి పాటలు పాడించి ఘనంగా భోగి వేడుకలను జరుపుకుంటున్నారు
పల్లెలు, పట్టణాలు అనే తేడా లేన్నట్టుగా భోగి మంటల కాంతులు విరజిమ్ముతున్నాయి. తమ కష్టాలను తొలగించాలని ప్రజలు అగ్ని దేవుడిని ప్రార్థిస్తున్నారు. తెలుగువారి పెద్ద పండుగల్లో ఒకటి సంక్రాంతి. భోగితో సంక్రాంతి సంబరాలు ప్రారంభమవుతాయి. నాలుగు రోజులు జరుపుకునే ఈ పండుగలో మొదటి రోజైన భోగి ప్రత్యేకమైంది. భోగభాగ్యాలు తెచ్చే తెలుగువారి భోగి అంటే చలి మంట మాత్రమే కాదు..ప్రతి సంవత్సరం సూర్యుడు మకరరాశిలోకి వెళ్లే ముందు రోజు భోగి పండుగను జరుపుకుంటారు. ధనుర్మాసం నేలంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు. ఆవుపేడతో చేసిన పిడకలని కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది. సూక్ష్మక్రిములు నశించి ఆక్సిజన్ గాలిలోకి అధికంగా విడుదలవుతుంది. దీనిని పీల్చడం ఆరోగ్యానికి మంచిది.
భోగి మంటల్లో ఇళ్లలోని పాత వస్తువులు, విరిగి పోయిన మంచాలు, కుర్చీలు, పాతవస్తువులను వేస్తారు. భోగి నుంచి ఇళ్లలో పండుగ కళ వస్తుంది. తెలుగు లోగిళ్లు సరికొత్తగా కళకళలాడుతాయి. భోగ భాగ్యాలు ప్రసాదించే పండుగతోనే సంబురాలు మొదలవుతాయి. అన్ని గ్రామాల్లోనూ వేకువజామున నుంచే భోగిపండగ తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా అన్ని గ్రామాల్లోనూ వేకువజామున నుంచే భోగిపండగ తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా వేడుకగా జరుపుకున్నారు. సేకరించిన దుంగలతో మంటలు వేశారు. ముందుగా తయారు చేసుకున్న భోగి పిడకలను చిన్నారుల తో మంటల్లో వేపిస్తూ సంబరపడిపోతున్నారు.. సేకరించిన పాత వస్తువులతో మంటలు వేశారు.