ఐఏఎస్ అధికారులకు సిగ్గుందో లేదో?
విశాఖపట్నం జిల్లా టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. 8 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులకు కోర్టు జైలు శిక్ష విధించడం రాష్ట్ర ప్రతిష్టకు దారుణమైన దెబ్బ అని, ఈ ఐఏఎస్ అధికారులకు సిగ్గుందో లేదో? నేనైతే రాజీనామా చేసే వెళ్లిపోయే వాడినని అన్నారు. ఐఏఎస్ అధికారుల్లో ఇప్పటికైనా మార్పు రావాలని పేర్కొన్న ఆయన లేకపోతే ఇప్పటికే కొందరు ఐ.ఏ.ఎస్.ల కోసం ఇప్పటి కే జైల్లో సెల్ లు రెడీగా ఉన్నాయి. మరికొంత మంది జైలుకు వెళ్లాలని కోరుకుంటే తప్పులు చేయండన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఐ.ఏ.ఎస్. అధికారి విజయ్ కుమార్ కు శిక్ష తప్పదని హెచ్చరించారు. ఇక అధికార పార్టీ ఎంపీ ఎంవీవీ విశాఖ, రాష్ట్రం వదిలి వెళ్లిపోతా అంటున్నాడు, ఇక బయట పెట్టుబడిదారులు రాష్ట్రానికి ఎందుకు వస్తారు? అని ప్రశ్నించారు. లులు, అదానీ కంపెనీలు ఈ విధంగా రాష్ట్రం వదిలిపోయాయని అన్నారు.