Balakrishna: బాలకృష్ణ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్
Balakrishna: సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో సాంకేతిక లోపం బయటపడింది. ఒంగోలు నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన కొద్దిసేపటికే హెలికాప్టర్ లో పైలెట్ సాంకేతిక లోపాన్ని గుర్తించారు. మొదటగా వాతవరణం లోపం అనుకున్నారు కానీ సాంకేతిక లోపంతో అత్యవసర ల్యాండింగ్ చేశారు.
టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సాంకేతిక లోపం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే, మళ్లీ ఒంగోలులో ల్యాండింగ్ చేశారు పైలెట్. దీంతో నందమూరి బాలయ్యకు పెను ప్రమాదమే తప్పింది. నిన్న ప్రత్యేక హెలికాఫ్టర్ లో ఒంగోలు లో జరిగిన ‘వీరసింహారెడ్డి’ ప్రీ రీలీజ్ ఈవెంట్ కి వెళ్లిన బాలయ్య ఈ ఉదయం హైదరాబాద్ కి బయలుదేరాడు. సాంకేతిక లోపాన్ని సరిచేయడం వీలు కాకపోతే బాలయ్య రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ కు వెళ్లే అవకాశమున్నట్లు సమాచారం.
రాయలసీమలో కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో ‘వీరసింహ రెడ్డి’ తెరకెక్కింది. కాగా ఇప్పటికే విడుదలైన వీరసింహారెడ్డి గ్లింప్స్ వీడియో బాలకృష్ణ అభిమానులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ తో సినిమా ఉండబోతుందని చెబుతోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ తో అంచనాలను పెంచేసింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది.