టెన్త్ పేపర్ లీకేజీ కేసులో మరో ఏడుగురికి బెయిల్
ఏపీలో టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ వ్యవహారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మాజీ మంత్రి నారయణను అరెస్ట్ చేయగా ఆయనకు వెంటనే బెయిల్ లభించింది. ఇక తాజాగా ఈ కేసులో ఏడుగురు నిందితులకు బెయిల్ మంజూరు చేస్తూ చిత్తూరు నాలుగో అదనపు న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్ పూర్తి చేసుకున్న ఏడుగురు బెయిల్ కోసం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే వీరికి 14 రోజుల పాటు రిమాండ్ పూర్తి కావడంతో శుక్రవారం వీరికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. తిరుపతి నారాయణ పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ గిరిధర్ రెడ్డి, చైతన్య స్కూల్ చంద్రగిరి ప్రిన్సిపాల్ సురేష్, ఎన్ఆర్ఐ అకాడమీ సిబ్బంది సుధాకర్, తిరుపతి చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ ఆరిఫ్, చైతన్య స్కూల్ తిరుపతి డీన్ మోహన్, జీడీ నెల్లూరు ప్రభుత్వ ఉపాధ్యాయులు పవన్, సోము,శ్రీ కృష్ణ రెడ్డిలకు బెయిల్ మంజూరు చేశారు.