వైసీపీ అసెంబ్లీలో భజన చేసే సంస్థ : అయ్యన్న ఆరోపణలు
విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు విమర్శల వర్షం కురిపించారు. మూడేళ్ల జగన్ పాలనలో రాష్ట్రం ఆర్ధికంగా దివాళా తీసిందని ఆయన విమర్శించారు. బ్రాందీ సీసాలు అమ్ముకోగా వచ్చే డబ్బులతో పాలిస్తామని స్వయంగా జగన్ అసెంబ్లీలో అనడం సిగ్గుచేటు అని ఆయన అన్నారు. మంత్రి పదవుల కోసం అసెంబ్లీలో భజనలు చేశారని, అసెంబ్లీలో భజన చేసే సంస్ధగా వైసీపీ మారిపోయిందని అన్నారు. బడ్జెట్ లో 48 వేల కోట్లకు అకౌంట్ లేదని కాగ్ రిపోర్ట్ ఇచ్చిందని కానీ కేంద్రం ఎందుకు చూస్తూ ఊరుకుంటోంది? అని ఆయన ప్రశ్నించారు. సిబిఐ ఎంక్వైరీ కావాలని ఎందుకు డిమాండ్ చేయలేకపోతున్నారు? అని ఆయన ప్రశ్నించారు. కోర్టు ఇచ్చిన బెయిల్ మీద తిరిగి సీఎం అయిన జగన్…మళ్లీ కోర్ట్ ల ను విమర్శిస్తారా? అంటూ ఆయన విమర్శించారు.