MLC Election results: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ హవా…వైసీపీ అంతానికిదే ఆరంభమన్ని అయ్యన్నపాత్రుడు
Ayyanna Patrudu reaction on TDP dominance in MLC Elections
ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా ఫలితాలు వస్తున్నాయి. అన్ని రౌండ్లలోను టీడీపీ అభ్యర్ధుల ఆధిపత్యం కొనసాగుతోంది. దీంతో టీడీపీ నేతలు, నాయకులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ఈ ఎన్నికల ఫలితాలపై ట్విట్టర్ వేదికగా స్పందించారు.
జగన్ ని ఛీ కొట్టిన ఉత్తరాంధ్ర అంటూ విమర్శలు మొదలు పెట్టారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి దూసుకుపోతుందని, ఏ రౌండ్ లోనూ, వైసీపీ కనీసం పోటీ ఇవ్వలేదని గుర్తుచేశారు. నాలుగో రౌండ్ అయ్యే సరికి 20 వేల ఆధిక్యంలో తెలుగుదేశం ఉందని అయ్యన్న పాత్రుడు ట్వీట్ చేశారు.
రాజధాని పేరుతో జగన్ విశాఖలో చేసిన విధ్వంసం, అలాగే గడచిన 4 ఏళ్ళ చీకటి పాలనను ప్రజలు గుర్తు చేసుకున్నారని..ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు గారు మాత్రమే కాపాడగలరని ప్రజలు గుర్తించారని … అందుకే ఈ వన్ సైడ్ ఫలితాలని అయ్యన్నపాత్రుడు విశ్లేషించారు. వైసీపీ అంతానికి ఆరంభం ఇదేనని ట్వీట్ ముగించారు.
రాజధాని పేరుతో జగన్ విశాఖలో చేసిన విధ్వంసం, అలాగే గడచిన 4 ఏళ్ళ చీకటి పాలనను ప్రజలు గుర్తు చేసుకున్నారు.
ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు గారు మాత్రమే కాపాడగలరని గుర్తించారు. అందుకే ఈ వన్ సైడ్ ఫలితాలు.
వైసీపీ అంతానికి ఆరంభం ఇదే.
సైకో పోవాలి – సైకిల్ రావాలి . 2/2
#ByeByeJaganIn2024— Ayyanna Patrudu (@AyyannaPatruduC) March 17, 2023