గడువు కావాలి
Avinash Reddy : వివేకా హత్య కేసులో (YS Viveka Case) కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ( Avinash Reddy) సీబీఐ ముందుకు విచారణకు ముందు ట్విస్ట్ ఇచ్చారు. బిజీ షెడ్యూల్ (Busy Schedule)కారణంగా ఇవాళ సీబీఐ (CBI)విచారణకు హాజరుకాలేకపోతున్నానని అవినాశ్ రెడ్డి తెలిపారు. నాలుగు రోజులు గడువు కావాలని సీబీఐకు అవినాష్ లేఖ రాశారు. అత్యవసర పనులు ఉన్నాయని ఈరోజు హాజరుకాలేనని ఆ లేఖలో తెలిపారు. అయితే అవినాష్ విజ్ఞప్తిపై సీబీఐ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఏం జరగనుందోననే ఉత్కంఠ నెలకొంది. వివేక హత్య కేసులో అవినాశ్‌కు 160 సీఆర్పీసీ కింద సీబీఐ సోమవారం నోటీసు (Notice)లు జారీ చేసింది మంగళవారం ఉదయం 11 గంటలకు సీబీఐ కార్యాలయం ముందు విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. ఇప్పటికే ఈ కేసులో పలు దఫాలుగా విచారణ చేసి స్టేట్మెంట్(Statement)ను సీబీఐ రికార్డ్ (Record)చేసింది. వివేకా హత్య కేసులో ముందస్తు బెయిల్ (Bail)ఇవ్వాలంటూ హైకోర్టు (High Court)లో అవినాశ్ పిటిషన్ వేయగా.. అందుకు హైకోర్టు నిరాకరించింది కూడా. వివేక హత్య కేసులో 20 రోజుల పాటు విరామం తర్వాత సీబీఐ ఎనిమిదో సారి అవినాశ్‌కు నోటీసులు జారీ చేసింది.
కడపలో అరెస్ట్ చేస్తారా?
అయితే వివేకా కేసులో దూకుడుగా విచారిస్తున్న సీబీఐ అవినాశ్ రెడ్డిని కడపలో అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. కడపలో ఇప్పటికే పలువురు సీబీఐ అధికారులు ఉండటంతో అవినాశ్ అరెస్ట్‌కు అవకాశమూ లేకపోలేదని సమాచారం. విచారణకు గడువు కోరిన తర్వాత దర్యాప్తు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండానే అవినాశ్ రెడ్డి వెళ్లిపోవటంతో సీబీఐ ఏ విధంగా స్పందిస్తుందో అన్నది ఆసక్తికరంగామారింది. 160 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చిన తర్వాత ఇలా చేయచ్చా లేదా అన్న అంశంపై కూడా స్పష్టత రావాల్సి ఉంది.
వివేకా హత్య కేసులో ఇప్పటి వరకూ అవినాశ్ రెడ్డి ఆరు సార్లు విచారణకు హాజరయ్యారు