అవినాశ్ బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. కొద్ది సేపు విచారణ తర్వాత రేపు ఉదయం వాదనలు వింటామని తెలంగాణ హై కోర్టు తెలిపింది.
Avinash Reddy Bail Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Vivekananda Reddy murder case) సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి (Avinash Reddy) ముందస్తు బెయిల్ (Bail) పిటిషన్ (Petition)పై తెలంగాణ హైకోర్టు (Telangana High Court) విచారణ చేపట్టింది. విచారణ అనంతరం తెలంగాణ హైకోర్టు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. శుక్రవారం ఉదయం వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది. కొద్దిసేపు వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. రేపు ఉదయమే వాదనలు వింటామని, శుక్రవారం ఉదయం 10:30 గంటలకు విచారణ ప్రారంభిస్తామని కోర్ట్ తెలిపింది. వివేకా హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ నిందితుడిగాచేర్చింది. ఇప్పటికే ఆయన్ను పలు మార్లు విచారించింది. విచారణలో భాగంగా ఆయనను అరెస్ట్ చేసే ఆలోచనలో ఉంది. తన తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్యంగా ఉన్నారని, అరెస్ట్ నుంచి మినహాయింపునివ్వాలని కోరుతున్నారు. ఈ మేరకు హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగుతోంది.
అవినాశ్ తల్లి హెల్త్ బులెటిన్
వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో వెల్లడించారు. శ్రీలక్ష్మిని త్వరలో సాధారణ వార్డుకు తరలించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.
కర్నూలుకు సీబీఐ అధికారులు
అవినాశ్ బెయిల్ పిటిషన్ పై హై కోర్టు తీర్పు రానున్న నేపథ్యంలో ఇప్పటికే సీబీఐ అధికారుల బృందం కర్నూలుకు చేరుకుంది. నాలుగు రోజుల నుంచి అవినాశ్ రెడ్డి కర్నూలులోనే ఉన్నారు. తల్లి చికిత్స పొందుతున్న విశ్వ భారతి ఆసుపత్రిలో నే ఉన్నారు.
సునీత ఇంప్లీడ్ అవుతారా?
అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ లో సునీత ఇంప్లీడ్ అయ్యే అవకాశముంది. అవినాశ్‌కు ముందస్తు బెయిల్ ఇస్తే కేసులో జరిగే పరిణామాలను.. కోర్టు దృష్టికి తీసుకెళ్తామని సీబీఐ, సునీతారెడ్డి చెబుతున్నారు.
సీబీఐని ఏ శక్తీ ఆపలేవు… జీవీఎల్
అవినాష్ రెడ్డి అరెస్ట్‌పై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. అవినాష్ రెడ్డి అరెస్ట్ పై ఉత్కంఠ దేనికని ప్రశ్నించారు. సీబీఐ చేతకాని సంస్థ అనుకుంటున్నారా? అంటూ మండిపడ్డారు. సీబీఐ నిర్ణయించుకుంటే ఎవరు వచ్చినా.. ఏ స్థాయికి వెళ్లైనా సరే అరెస్ట్ చేస్తారని చెప్పుకొచ్చారు. ఫ్యాక్షనిజం ఒత్తిళ్లకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆగబోవు.. లొంగవు అని తెలిపారు. సీబీఐ నిర్ణయం తీసుకునేంత వరకూ ఓపిక పట్టాల్సిందే.. సీబీఐ ని ఏ శక్తీ ఆపలేదంటూ తేల్చిచెప్పారు.