ఏపీ మంత్రి, సినీ నటి రోజా భర్త తమిళ సినీ దర్శకుడు ఆర్కే సెల్వమణి గురించి పరిచయం అక్కర్లేదు. ఆయన సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆయనపై కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటు జారీ చేసింది.
AP Minister Roja : ఏపీ మంత్రి, సినీ నటి రోజా భర్త తమిళ సినీ దర్శకుడు ఆర్కే సెల్వమణి(RK Selvamani) గురించి పరిచయం అక్కర్లేదు. ఆయన సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను(Super hit movies) తెరకెక్కించి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆయనపై కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటు(Non bailable arrest warrant) జారీ చేసింది. చెన్నైలోని జార్జ్‌టౌన్ కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజా(Andhra pradesh minister RK Roja) భర్త ఆర్కే సెల్వమణి ఎన్నో సినిమాలు తెరకెక్కించారు. 1990 సంవత్సరంలో ఆయన సినీ ప్రస్థానం మొదలు అయింది. తమిళ దర్శకుడిగా ఎన్నో చిత్రాలు తెరకెక్కించి ఇండస్ట్రీకి సూపర్ హిట్ సినిమాలను అందించారు. ఆయన తెరకెక్కించిన పలు చిత్రాలు తెలుగులోనూ డబ్ అయ్యాయి. సెల్వమణి.. నటి రోజాను 2002 ఆగస్టు 10న వివాహం చేసుకున్నారు. ఇక వీరికి ఒక కుమార్తె అంశుమాలిక, ఒక కుమారుడు కృష్ణ లోహిత్ సెల్వమణి , కుమార్తె అంశుమాలిక సెల్వమణి ఉన్నారు. రోజా సినిమాలకు పుల్ స్టాప్ పెట్టిన తర్వాత కొన్నాళ్లు జబర్దస్త్ వంటి ప్రోగ్రామ్స్‌లో మెరిశారు. వీరి ఫ్యామిలీని ఓ సారి ప్రోగ్రామ్‌కు కూడా తీసుకువచ్చి పరిచయం చేశారు.
ఇక ప్రస్తుతం సెల్వమణి.. 2022-24 సంవత్సరాలకుగాను దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) అధ్యక్షుడుగా విధులు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. సెల్వమణిపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటు(Arrest Warrant) జారీ చేసింది కోర్టు. చెన్నైలోని(Chennai) జార్జ్‌టౌన్ కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. 2016లో చెన్నైలో ఓ తమిళ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు సెల్వమణి. ఆ ఇంటర్వూయే ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టిందని చెప్పవచ్చు. ఎందుకంటే.. ఆ ఇంటర్వ్యూలో తనను కించపర్చేలా మాట్లాడారంటూ సెల్వమణిపై సినీ ఫైనాన్షియర్ ముకుంద్ చంద్ బోత్రా .. కోర్టులో పరువునష్టం దావా కేసు వేశారు. ముకుంద్ కారణంగా తాను ఇబ్బందులకు గురయ్యానంటూ సెల్వమణి ఓ మీడియా ఛానల్ ముఖాముఖిలో చెప్పారనే ఆరోపణలు ఉన్నాయి.
కోర్టులో కేసు వేసిన ముకుంద్ చంద్ బోత్రా(Munkund chand bothra) మృతి చెందారు. అయితే ఇప్పుడు ఆ కేసును ముకుంద్ కొడుకు గగన్ బోత్రా కొనసాగిస్తున్నారు. ఈ కేసు విచారణ జరిగినప్పటికీ సెల్వమణి హాజరుకాలేదు. గతంలోనూ సెల్వమణి విచారణకు దూరంగా ఉన్నారు. అయనికి సంబంధించిన లాయర్లు కూడా కోర్టుకు రాలేదు. దీంతో సెల్వమణి తీరుపై చెన్నై జార్జిటౌన్ కోర్టు సీరియస్‌గా రియాక్ట్ అయింది. దీంతో సెల్వమణికి కోర్టు నాన్ బెయిల్‌బుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ విషయంపై మంత్రి రోజా, ఆమె భర్త సెల్వమణి స్పందించలేదు.. ఎలా రియాక్ట్ అవుతారో అనేది చూడాలి.