స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) క్వాష్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు(High Court)లో విచారణ ముగిసింది.చంద్రబాబు తరఫున ప్రముఖ న్యాయమూర్తులు సిద్ధార్థ లూథ్రా , హరీష్ సాల్వే వాదించగా.. దీనిపై ఉత్తర్వులను హైకోర్ట్ రిజర్వ్‌లో ఉంచింది .
Chandrababu: స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) క్వాష్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు(High Court)లో విచారణ ముగిసింది.చంద్రబాబు తరఫున ప్రముఖ న్యాయమూర్తులు సిద్ధార్థ లూథ్రా , హరీష్ సాల్వే వాదించగా.. దీనిపై ఉత్తర్వులను హైకోర్ట్ రిజర్వ్‌లో ఉంచింది .
చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై ఉదయం నుంచి ఏపీ హైకోర్టులో వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు ప్రముఖ సీనియర్ లాయర్లు సిద్దార్థ్ లూథ్రా, హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. అయితే హరీష్ సాల్వే వర్చువల్‌గా తన వాదనలు న్యాయమూర్తికి వినిపించగా.. సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ కూడా వర్చువల్‌గా వాదించారు
ఉదయం హరీష్ సాల్వే తర్వాత సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించగా..మధ్యాహ్నం 2.15కి కోర్టు విచారణను వాయిదా వేసింది. లంచ్ బ్రేక్ తర్వాత మరోసారి వాదనలు మొదలవగా..సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ తన వాదనలు వినిపించారు.