మొదలైన బాదుడు.. ఆర్టీసీ ఛార్జీలు పెంచిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్‌లో బస్ ఛార్జీలు పెంచుతున్నట్టు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. 2019లో ఆర్టీసీ ఛార్జీలు పెంచినప్పుడు లీటర్ డీజిల్ ధర 67 రూపాయలుగా ఉందన్న ఎండీ.. ఇప్పుడు ఆ రేటు 107కు చేరిందన్నారు. 2019తో పోల్చితే డీజిల్ రేటు 40 రూపాయలు పెరిగినట్టు తిరుమల రావు తెలిపారు. ఏపీఎస్ ఆర్టీసీపై డీజిల్ సెస్ విధిస్తున్నట్టు ఆర్టీసీ ఎండీ తెలిపారు. పల్లె వెలుగు బస్సులకు 2 రూపాయల డీజిల్ సెస్ విధిస్తున్నట్లు, ఎక్స్‌ప్రెస్ బస్సులకు 5 రూపాలయల సెస్ విదించినట్టు తెలిపారు. దీంతో పాటు హైఎండ్ బస్సులకు 10 రూపాలయ డీసిల్ సెస్ విదించినట్టు తిరుమలరావు తెలిపారు. పెరిగిన ఛార్జీలు రేపటి నుంచి అమలులోకి వస్తాయని ఆర్టీసీ ఎండీ స్పష్టం చేశారు.
కోవిడ్ వల్ల ఆర్టీసీ అప్పుల్లో కూరుకుపోయిందని ఆర్టీసీ ఎండీ తెలిపారు. దీంతో పాటు రోజు రోజుకూ పెరుగుతున్న డీజిల్ రేట్ల వల్ల ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రజలు సంస్థ భారాన్ని అర్థం చేసుకోవాలని ఎండీ తిరుమలరావు కోరారు.