Apple Company in AP: ఏపీలో యాపిల్ కంపెనీ పెట్టుబడులు
Apple Company is ready to invest in Andhra Pradesh
యాపిల్ కంపెనీ ఏపీలో ఎంట్రీ ఇవ్వనుంది. సెల్ ఫోన్ సెన్సార్ తయారీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ఐటీ మంత్రి అమర్నాథ్ తెలిపారు. ఇన్ఫినిటీ 2023 సదస్సులో పాల్గోన్న మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. అదే విధంగా ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విషయమపై కూడా మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి కామెంట్స్ చేశారు. ఈ రోజు నుంచి రెండు నెలల వ్యవధిలో విశాఖ పరిపాలన రాజధాని కాబోతోందని స్పష్టం చేశారు.
2019 డిసెంబర్ 18న అసెంబ్లీ వేదికగా ఏపీ ప్రభుత్వం 3 రాజధానుల ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చింది. ఆ తర్వాత నుంచి అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రతిపక్షాలు కోర్టు మెట్లు ఎక్కడంతో ప్రభుత్వానికి అనేక ఆటంకాలు ఎదురయ్యాయి. వీటన్నిటిని అధిగమించి ఏపీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. విశాఖ నుంచి త్వరలోనే పాలన ప్రారంభించాలని జగన్ సర్కార్ నిర్ణయించింది.
మంత్రి బొత్స సత్యనారాయణ, మంత్రి అమర్నాథ్ పదే పదే రాజధాని విషయంలో స్పష్టమైన సంకేతాలు ఇస్తూ ప్రభుత్వ ఉద్దేశ్యాన్ని చాటుతూనే ఉన్నారు. సీఎం జగన్ కూడా ఇటీవల జరిగిన ఓ సమావేశంలో విశాఖ నుంచి పాలన చేయబోతున్న విషయాన్ని స్వయంగా ప్రకటించారు.