ఏపీ టిక్కెట్ పోర్టల్ మెగా కాంపౌండ్‌కు?
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్లన్నింటినీ ప్రభుత్వమే ఆన్ లైన్ ద్వారా అమ్మాలని నిర్ణయించుకున్నా సంగతి తెలిసిందే. ఇప్పటికే దీని మీద అధికారిక జీవోలు కూడా జారీ అయ్యాయి. అయితే ప్రభుత్వం స్వయంగా ఈ టికెటింగ్ గెట్‌వే ఏర్పాటు చేయడం లేదు. ప్రైవేటు టిక్కెటింగ్ వ్యవస్థకు బాధ్యతలు అప్పగించాలని దీని మీద నియమించిన కమిటీ నిర్ధారించింది. ఈ క్రమంలో టెండర్లు పిలవగా బుక్ మై షోతో పాటు జస్ట్ టికెట్ అనే మరో సంస్థ కూడా ఈ టెండర్లలో పాల్గొన్నది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఎల్ 1 గా జస్ట్ టికెట్ నిలిచినట్లు తెలుస్తోంది.ఈ సంస్థలో అల్లు అరవింద్ కుమారుడు అల్లు వెంకటేష్ డైరెక్టర్ గా ఉన్నారు. ప్రస్తుతం ఆయన గని సినిమా నిర్మాతగా కూడా ఉన్నారు. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి రోజు నుంచి అంటే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే ఆన్ లైన్ టిక్కెట్ల వ్యవస్థను అందుబాటులోకి తేవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతూ ఉండడంతో జస్ట్ టిక్కెట్‌కు ఏపీ ప్రభుత్వ అధికారిక టికెట్ బుకింగ్ గెట్‌వేగా కాంట్రాక్ట్ ఇస్తున్నట్లుగా ఏ క్షణమైనా ప్రకటన వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ 1 తర్వాత ఏపీలో ఎక్కడ సినిమా చూడాలన్నా జస్ట్ టిక్కెట్ ద్వారా మాత్రమే కొనుగోలు చేయాలి. ధియేటర్లలో బుకింగ్‌లు కూడా ఆ పోర్టల్ ద్వారానే చేయాల్సి ఉంటుందని అంటున్నారు. ఇక జస్ట్ టిక్కెట్ కాంట్రాక్ట్ దక్కడం అంటే మెగా కాంపౌండ్‌కు ఆ అవకాశం ఇచ్చినట్టుగానే ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.