Good News: మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంపు
AP municipal workers:ఏపీలో గత 4 రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. మున్సిపల్ కార్మికుల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ కార్మికుల వేతనాలను 21 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. సీఎం జగన్ ఆదేశాలతో రంగంలోకి దిగిన మంత్రుల కమిటీ కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరిపింది. గురువారం సీఎంతో సమావేశమైన మంత్రులు ఆదిమూలపు సురేశ్, బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలు కార్మికుల డిమాండ్లు, వాటి పరిష్కారంపై తీసుకోవాల్సిన చర్యలను జగన్కు వివరించారు.
కార్మికుల హెల్త్ అలవెన్స్ కోసం ఇస్తున్న 6 వేల రూపాయలను అలాగే కొనసాగిస్తూ కార్మికుల వేతనాన్ని 21 వేలకు పెంచాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. జగన్తో చర్చల అనంతరం కార్మికుల జీతాల పెంచినట్లు అధికారంగా ప్రకటించారు. హెల్త్ అలవెన్స్, వేతనాలకు సంబంధించిన కార్మికుల ప్రధాన డిమాండ్లను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. మిగిలిన డిమాండ్లపై తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. ప్రధాన డిమాండ్లు పరిష్కారం అయిన నేపథ్యంలో రేపటి నుంచి కార్మికులు విధులకు హాజరు కావాలని ఆయన కోరారు.