AP MLC Elections: రెండు చోట్ల రీపోలింగ్
AP MLC Elections: ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. ఈనెల 16వ తేదీన ఈ ఎన్నికల కౌంటింగ్ జరగనున్నది. అయితే, ఈ ఎన్నికల్లో రెండు చోట్ల రీపోలింగ్‌ను నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. శ్రీకాకుళం, తిరుపతిలో రెండు చోట్ల రీపోలింగ్‌ను నిర్వహించనున్నారు. శ్రీకాకుళంలో పోలింగ్ సమయంలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. శ్రీకాకుళంలో టీడీపీ నేతలపై అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. కులం పేరుతో దూషించారని వారిపై కేసులు నమోదు చేశారు. ఇక తిరుపతిలోనూ ఓటింగ్ సమయంలో ఉద్రిక్తలు చోటు చేసుకున్నాయి.
బోగస్ ఓట్లు, రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారనే ఆరోపణలపై తిరుపతిలో పోలింగ్ సమయంలో గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఏజెంట్లు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ, బీజేపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తిరుపతి, శ్రీకాకుళంలో రీపోలింగ్ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ రెండు ప్రాంతాల్లో రేపు రీపోలింగ్ నిర్వహించనున్నారు. రెండు చోట్ల మినహా అంతా ప్రశాంతంగా పోలింగ్ జరిగినట్లు అధికారులు స్పష్టం చేశారు. కాగా, ఈనెల 16వ తేదీన ఈ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది 16 వ తేదీ సాయంత్రం వరకు తెలుస్తుంది.