MLC Elections Results: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు.. రెండు చోట్ల వైకాపా విజయం
MLC Elections Results: ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. మొత్తం 9 స్థానాలకు 139 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పట్టభద్రుల నియోజకవర్గ స్థానాలకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు తలపడ్డారు. 3 గ్రాడుయేట్, 2 ఉపాధ్యాయ, 4 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. నేడు ఈ ఎన్నికల కౌటింగ్ మొదలుకాగా వైసీపీ ముందంజలో ఉంది ఇప్పటికే రెండు స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది.
పశ్చిమ గోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కవురు శ్రీనివాస్ గెలిచారు. అలాగే కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ మధుసూదన్ విజయం సాధించారు. 988 ఓట్ల మెజారిటీతో ఆయన విజయాన్ని దక్కించుకున్నారు. మొత్తం 1178 ఓట్లలో 1136 ఓట్లు పోలవగా.. 1083 ఓట్లు మాత్రమే చెల్లినవిగా పరిగణించారు. ఇందులో మొదటి ప్రాధాన్యత ఓట్లు 542 ఎవరికి వస్తాయో వారిని విజేతగా ప్రకటించనున్నారు ఎన్నికల అధికారులు.. అయితే, వైసిపి అభ్యర్థి డాక్టర్ మధుసూదన్ పూర్తిస్థాయి మెజారిటీ రావడంతో విజేతగా ప్రకటించారు.