AP Minister: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బుల పంపిణీ, సమీక్ష చేపట్టిన మంత్రి ఉషశ్రీ
AP Minister talking about the Money distribution to MLC Voters
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి. ఓటర్ల నమోదులో అనేక అవతవకలు జరిగాయని విపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో వారికి మరో ఆయుధం దొరికింది. ఏకండా ఏపీ మంత్రి ఉషశ్రీ డబ్బుల పంపకం గురించి మాట్లాడిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓటర్లకు డబ్బులు అందాయా లేదా అనే విషయం క్రాస్ చెక్ చేయాలని మంత్రి కార్యకర్తలను ఆదేశించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది.
ఒక్కొక్క ఓటుకి 1000 రూపాయలు ఇవ్వండని, ఒక ఊరులో 20 మంది ఉంటే 20 వేలు ఇవ్వండని మంత్రి తెలిపారు. డబ్బులు వారికి అందాయా లేదా అనే విషయం క్రాస్ చెక్ చేసుకోవాలని ఆదేశించారు.
మంత్రి ఉషశ్రీ డబ్బుల పంపకం గురించి మాట్లాడిన వీడియో వైరల్ కావడంతో విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలకు దిగుతున్నాయి. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడానికి సిద్ధమౌతున్నాయి. ప్రస్తుతానికి సోషల్ మీడియా ద్వారా ఆ వీడియోను మరింత వైరల్ చేస్తూ ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
YCP minister discussion about money distribution to voters for MLC elections, kindly look into this and take necessary action @ECISVEEP pic.twitter.com/tFmouXbxzj
— JPR యువగళం (@JPRJayaPalReddY) March 12, 2023
pic.twitter.com/yFn0t2TNcX@yashwan46344725 Official ga Minister monitoring cash distribution for MLC election wow Kotha kotha vintalu YCP palanalo super
— Venkatesh (@Venki518) March 12, 2023
AP Minister: