AP Minister Roja: ఏపీ మంత్రి రోజా భావోద్వేగం, కారణమిదే!
AP Minister Roja became emotional in an interview
ఏపీ టూరిజం మంత్రి రోజా తన జీవితంలో కొన్ని సంఘటలను తలచుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఓ కార్యక్రమానికి హాజరైన రోజా తాను ఫ్యామిలీ విషయాల్లో చాలా ఎమోషనల్ అని తెలిపారు. తనకు ఫైబ్రాయిడ్ సమస్య ఉందని, పిల్లలు పుట్టరని వైద్యులు ఓ షాకింగ్ న్యూస్ చెప్పారని రోజా గుర్తుచేసుకున్నారు. తనకు 2000 సంవత్సరంలో లాప్రోస్కోపీ సర్జరీ జరిగిందని, అది జరిగిన రెండేళ్ల తర్వాత 2002లో తమకు పెళ్లయిందని రోజా తెలిపారు. పెళ్లయిన ఏడాదికే తనకు పాప అన్షు పుట్టిందని, ఈ విషయం తెలియగానే డాక్టర్ ఎగిరి గంతేసిందని రోజా తెలిపారు.
నీ ప్రార్థనలు దేవుడు విన్నాడు. అందుకే నిన్ను కరుణించాడని హర్షం వ్యక్తం చేసింది. అసలు పిల్లలు పుట్టే అవకాశం లేదు అనుకుంటున్న సమయంలో అన్షు నా కడుపున పుట్టింది. అందుకే నాకు పాపంటే ప్రాణం.. నా ఇద్దరు పిల్లలకు వారికి నచ్చినట్లే వారి జీవితాలు ఉండాలనుకుంటాను’ అంటూ ఎమోషనలయ్యారు రోజా.
రాజకీయాలకే అంకితమైన రోజా
సినిమాల్లో తనదైన ముద్ర వేసిన రోజా ప్రస్తుతం పూర్తిగా రాజకీయాలకే అంకితం అయ్యారు. ఏపీ టూరిజం మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాజకీయాల్లోకి రాకముందు సినిమా రంగంలో, టీవీ రంగంలో ఓ వెలుగు వెలిగారు. తెలుగు సినిమా రంగంలో కొంత కాలం పాటు దూసుకుపోయారు. స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. సినిమాలలో అవకాశాలు తగ్గిన నేపథ్యంలో ఈటీవీలో జబర్దస్త్ షో ద్వారా తన ఉనికిని చాటుకున్నారు.