Dharmana Prasad: తన ప్రాంత ప్రజల కోసం గొంతెత్తకుండా ఉండను, ధర్మాన స్పష్టీకరణ
AP Minister Dharmana comments on Uttrandhra
విశాఖ కేంద్రంగా మాకు రాష్ట్రం కావాలని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మరోసారి డిమాండ్ చేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లువుతున్నా ఇప్పటికీ పూర్తిగా వేనకపడే ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ జెట్టీలు లేవు , హార్బర్లులేవు , గ్రామాల్లో త్రాగునీరు లేదని ఇక్కడి ప్రజలు పడుతున్న బాధను వ్యక్తం చేశారు. శ్రీకాకుళం పట్టణంలోని పోట్టి శ్రీరాములు మార్కేట్లో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించిన సందర్భంగా మంత్రి ధర్మాన ప్రసాద రావు ఈ వ్యాఖ్యలు చేశారు.
ధర్మాన ప్రసాదరావు భూములు దోబ్బేసాడని .. కొందరు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రెవిన్యూ మినిష్టర్ గా .. సెంటు భూమి ఇచ్చే అధికారం తనకు లేదనే విషయాన్ని గుర్తుచేశారు. రెవిన్యూ మినిష్టర్‌గా భూములు దోబ్బే అవకాశం ఉందా? అంటూ ప్రశ్నించారు. క్యాబినేట్ మాత్రమే ఎవరికైనా భూములు ఇవ్వగలదని తెలిపారు.
నా రాజకీయ జీవితంలో ఏపని కైనా నయా పైసా ప్రతిఫలం తీసుకున్నానని రుజువు చేస్తే ..నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ధర్మాన అన్నారు. దమ్ముంటే నా పక్కన చంద్రబాబుని నిజాయితీగా నిలబడమనండని సవాలు విసిరారు. చంద్రబాబు ఏన్నింటిలో అక్రమాలు చేసాడో నిరూపిస్తానని ధర్మాన అన్నారు.
మా ప్రాంతం కోసం మాట్లాడితే .. అవినితి పరుడినని ముద్ర వేస్తారా అంటూ మండిపడ్డారు. కావాలంటే మంత్రి, ఎమ్మెల్యే పదవులు వదిలేస్తానని .. కానీ తన ప్రాంత ప్రజల కోసం గొంతెత్తకుండా ఉండనని స్పష్టం చేశారు. అధికార పార్టీలో ఉన్నా ప్రజల కోసం అధికార పార్టీనైనా ప్రశ్నిస్తానని తెలిపారు. చంద్రబాబు ఒకే రాజధాని అని అమరావతిగా ప్రకటిస్తే .. మా రాష్ట్రం అక్కడ ఉండటానికి ఒప్పుకోమని ధర్మాన స్పష్టం చేశారు.