Ambati Dance: భోగి వేడుకల్లో చిందులేసిన అంబటి
Minister Ambati Rambabu Dance: తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు మొదలయ్యాయి. ఉదయం నుంచే పలువురు భోగి మంటలతో సంబురాలు చేసుకుంటున్నారు. ప్రముఖులు భోగి శుభాకాంక్షలు చెబుతున్నారు. నాలుగు రోజులు జరుపుకునే ఈ పండుగలో తొలిరోజైన భోగి ప్రత్యేకమైనది. భోగభాగ్యాలు తెచ్చే తెలుగు వారి భోగి అంటే.. చలి మంట మాత్రమే కాదు. ప్రతి సంవత్సరం సూర్యుడు మకర రాశిలోకి వెళ్లే ముందురోజు భోగి పండుగు జరుపుకుంటున్నారు.
సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు స్థానికులతో కలిసి భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా భోగి మంటలు వేసి ఆతరువాత స్టెప్పులతో అదరగొట్టారు. గత ఏడాది కూడా సత్తెనపల్లిలో అంబటి రాంబాబు సంక్రాంతి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక ఈ ఏడాది కూడా తనదైన మార్క్ స్టెప్పులతో అక్కడున్నవారిలో జోష్ ని నింపారు.
బంజారా డాన్స్ చేసారు. స్టెప్పులతో హోరెత్తించారు. మంత్రి స్టెప్పులు వేస్తున్న సమయంలో పాల్గొన్న యువత కేరింతలు కొడుతూ మద్దతు పలికారు. డప్పు కళాకారులు బంజారాలతో కలిసి భోగి మంటల చుట్టూ పాటలు పాడుతూ.. డాన్స్ లు చేస్తూ పండుగను ఆస్వాదించారు. అంబటి రాంబాబు డాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
భోగి,సంక్రాంతి శుభాకాంక్షలు! pic.twitter.com/nWj2ZaLPDN
— Ambati Rambabu (@AmbatiRambabu) January 14, 2023