Ambati Rambabu: బాబు కోసమే జనసేన పుట్టింది – అంబటి సెటైర్లు
AP Minister Ambati Rambabu comments on Babu, Pawan meet
పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీ ఆశ్చర్యకర పరిణామం కాదని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు కోసం పుట్టిన పార్టీయే జనసేన అని అన్నారు. ప్యాకేజీ తీసుకుని చంద్రబాబును పవన్ కళ్యాణ్ భుజాన మోస్తాడని సీఎం జగన్ రెండు మూడేళ్ళ క్రితమే చెప్పారని అంబటి గుర్తుచేశారు.
వాళ్ళిద్దరూ కలిసింది ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి కాదని, టీడీపీ పరిరక్షణ కోసం చర్చించుకున్నారని అంబటి అన్నారు. పవన్ కళ్యాణ్ కృషికి చంద్రబాబు ఎంత ఇవ్వాలి అనేది చర్చించుకున్నారని, ఈ ఎపిసోడ్‌లో ఆశ్చర్య పోవాల్సింది బీజేపీయేనని, పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడని నమ్మే అమాయకులు ఆశ్చర్యపోవాలని అంబటి అన్నారు. కలవటానికి ఇంత తాపత్రయం పడుతున్నారంటేనే మేం ఎంత బలంగా ఉన్నామో అర్థం అవుతుందని అంబటి రాంబాబు తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా మీద ఎన్ని ఆంక్షలు పెట్టారో గుర్తుచేసుకోవాలని అంబటి అన్నారు.
చిరంజీవికి పార్టీ నడపటం చేతకాలేదని, ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసి మంత్రి పదవి తీసుకున్నారని అంబటి గుర్తుచేశారు. పవన్ కళ్యాణ్ లా డ్రామాలు ఆడలేదని చురకలంటించారు.