Boppa Raju: మా ఉద్యమాన్ని నిజాయితీగా కొనసాగిస్తాం – బొప్పరాజు
AP JAC Chairman Boppa Raju announced the action Plan of the JAC
ప్రభుత్వానికి ఏపీ జేఏసీ అమరావతి షాక్ ఇచ్చింది. ఉద్యమాన్ని కొనసాగించాలని ఏపీ జేఏసీ అమరావతి నిర్ణయం తీసుకుంది.మినిట్స్ కాపీలు ఇచ్చిన తర్వాత కూడా ఉద్యమం కొనసాగించాలని అత్యవసర కార్యవర్గం అభిప్రాయపడింది.ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు.
మా ఉద్యమాన్ని నిజాయితీగా కొనసాగిస్తామని తెలిపారు. ప్రభుత్వం కొన్ని అంశాలకు సానుకూలంగా స్పందించిన కారణంగా ఉద్యమ తీవ్రత తగ్గించి శాంతియుతంగా నిరసనలు తెలుపుతామని తెలిపారు. ఉద్యోగుల ఆవేదన చూసి అయినా ప్రభుత్వంలో మార్పు రావాలని కోరుతున్నామని తెలిపారు. గతంలో చేసిన పోరాట ప్రణాళికలో చిన్న చిన్న మార్పులు చేశామని తెలిపారు. నేటి నుంచి నల్ల బ్యాడ్జీలు ధరించి వచ్చే నెల ఐదు వరకు విధుల్లో పాల్గొంటామని బొప్పరాజు తెలిపారు.
ఈనెల 17, 20 తేదీలలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సందర్శించి మద్దతు కోరతామని తెలిపారు. ఈ నెల 21వ తేదీన సెల్ డౌన్ యధావిధిగా ఉంటుందని బొప్పరాజు తెలిపారు. ఈ నెల 27వ తేదీన కారుణ్య నియామకాలు కోసం వారి కుటుంబం సభ్యులను కలుస్తామని, వచ్చే నెల ఐదో తేదీన మరోసారి సమావేశం ఏర్పాటు చేస్తామని బొప్పరాజు వివరించారు. ఈ నెల రోజుల అంశాలను మరో సారి చర్చించి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.