AP Highcourt on Ex Minister Narayana Case: నారాయణను ఇంటివద్దే విచారించాలి
AP Highcourt on Ex Minister Narayana Case: ఏపీ మాజీ మంత్రి నారాయణను ఆయన ఇంటివద్దే విచారణ నిర్వహించాలని సీఐడీ అధికారులను ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఏపీ రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ఎలైన్‌మెంట్ విషయంలో అవకతవకలకు పాల్పడ్డారని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఇచ్చిన ఫిర్యాదుతో ఏపీ సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు. సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం ఆయనకు, ఆయన భార్య రమాదేవికి నోటీసులు జారీ చేశారు. కాగా, మహిళలను ఇంటివద్దే విచారించాలని, సుప్రీంకోర్టు ఆదేశాలను కోట్ చేస్తూ నారాయణ తరపున న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు.
ఈ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం నారాయణను ఆయన ఇంటి వద్దే విచారించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆయనతో పాటు ఆయన భార్యను, అదేవిధంగా ఈ కేసులో ఇప్పటికే నోటీసులు అందుకున్న మరో ఉద్యోగిని ప్రమీలను కూడా ఆమె ఇంటివద్దనే విచారించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో వీరితో పాటు నారాయణ కుమార్తెలు ఇద్దరికీ, వారి భర్తలకు కూడా ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరి ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సీఐడీ అధికారులు నారాయణ ఇంటివద్దే విచారణ నిర్వహిస్తారా లేదా చూడాలి.