AP High Court: ఏపీ ప్రభుత్వం మీద హైకోర్టు సీరియస్
AP High Court Serious: ఏపీ హైకోర్టు ప్రభుత్వం మీద సీరియస్ అయింది. ఆంధ్ర ప్రదేశ్ లో పాఠశాలల ఆవరణలో గ్రామ సచివాలయాల నిర్మాణంపై హైకోర్టులో విచారణ జరిగింది. సచివాలయాల నిర్మాణంపై హైకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది నిర్మించిన భవనాలను పాఠశాలలకే అప్పగిస్తామని వెల్లడించారు. కోర్టు నిర్మాణాలు ఆపమని చెప్పినా కొనసాగించడం అక్రమమే కదా అని హైకోర్టు ప్రశ్నించింది. పాఠశాలల అవసరాలకే వినియోగించేలా చేస్తున్నామని ప్రభుత్వం తరపున న్యాయవాది వాదించారు. దీనికి స్పందించిన హైకోర్టు అలా అనుకుంటే ప్రజావేదిక కూడా ప్రజల సొమ్ముతో కట్టారు కదా అన్న హైకోర్టు అప్పుడొక వైఖరి… ఇప్పుడొక వైఖరి అయితే ఎలా అని ప్రశ్నించింది. ఇక కేసులో తదుపరి విచారణ ఈనెల 24 కి వాయిదా వేసింది హైకోర్టు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్స్‌లో కట్టిన రైతు భరోసా కేంద్రాలు, గ్రామ, వార్డు సచివాలయాలు, ఇతర పంచాయతీ భవనాలను విద్యాశాఖకు అప్పగించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా స్కూల్స్‌లో నిర్మాణాలు చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్స్‌లో కట్టిన రైతు భరోసా కేంద్రాలు, గ్రామ, వార్డు సచివాలయాలు, ఇతర పంచాయతీ భవనాలను విద్యాశాఖకు అప్పగించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా స్కూల్స్‌లో నిర్మాణాలు చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది, అయినా ఏపీ ప్రభుత్వం మరో సారి అదేవిధంగా చేయడంతో హైకోర్టు సీరియస్ అయింది.