విశాఖలోని రుషికొండ తవ్వకాలపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రుషికొండపై సర్వే చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అధికారుల బృందాన్ని కోర్టు ఆదేశించింది.
విశాఖలోని రుషికొండ తవ్వకాలపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రుషికొండపై సర్వే చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అధికారుల బృందాన్ని కోర్టు ఆదేశించింది.
అనుమతికి మించి ఎంత మేర తవ్వకాలు చేపట్టారో, ఎంత మేర భవనాలు నిర్మిస్తున్నారో సర్వే చేయాలని సూచించింది. సర్వే చేసి నివేదికను హైకోర్టుకు సమర్పించాలని సర్వే బృందాన్ని ధర్మాసనం ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 14కు వాయిదా వేసింది.
రుషికొండలో తవ్వకాల్లో భాగంగా అదనంగా 3 ఎకరాల్లో మాత్రమే తవ్వకాలు చేశామని ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. ఏపీ ప్రభుత్వ వాదన తప్పని, అందులో వాస్తవం లేదని కొందరు కోర్టును ఆశ్రయించారు. 20 ఎకరాలు అదనంగా తవ్వకాలు జరిపారని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుతో పాటు మరికొందరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సర్వే చేపట్టాలని అటవీ శాఖ, పర్యావరణ టీమ్లతో సర్వే జరిపించాలని ఆదేశించింది.