Ayyanna Patrudu : హైకోర్టులో ఊరట
మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడుకి హైకోర్టులో ఊరట లభించింది. రెండ్రోజుల క్రితం ఆయన ఇంటి కాంపౌండ్‌వాల్‌ను ఆక్రమిత భూమిలో నిర్మించారంటూ మున్సిపల్, రెవెన్యూ అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో అనకాపల్లి జిల్లా, నర్సీపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలిసిన అయ్యన్నపాత్రుడు అనుచరులు, టీడీపీ కార్యకర్తలు అక్కడికి భారీ ఎత్తున చేరుకోగా… పోలీసులకు, వారికి మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో కూల్చివేత కార్యక్రమాన్ని అధికారులు మధ్యలోనే నిలిపివేశారు. అదే సమయంలో తెల్లవారుజామున 4 గంటలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, కూల్చివేతపై తమకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వలేదని అయ్యన్న కుమారుడు చింతకాయల రాజేష్ ఫైర్ అయ్యారు. అంతేకాదు ఈ విషయంపై న్యాయం కోరుతూ అయ్యన్న ఫ్యామిలీ కోర్టు మెట్లు కూడా ఎక్కారు. దీంతో వెంటనే కోర్ట్ కూల్చివేతపై కోర్టు స్టే విధించింది. ఇప్పుడు అయ్యన్నకు హైకోర్టులో లైన్ క్లియర్ అయ్యింది. తాజాగా జరిగిన కోర్ట్ విచారణలో నిబంధనలకు విరుద్ధంగా గోడ కూల్చారని అయ్యన్న తరపు పిటిషనర్ వాదించగా, గోడ కట్టుకునేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఇక విచారణను వాయిదా వేసింది ధర్మాసనం.