AP Grama Sachivalayam Notification 2023: ఏపీ గ్రామ వార్డు సచివాలయాల్లో 14 వేల పోస్టులకు నోటిపికేషన్
AP Grama Sachivalayam Notification 2023: ఏపీలో గ్రామ వార్డు సచివాలయాల్లో పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఏపీ ప్రభుత్వం సుమారు 14 వేల పోస్టులకు నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది. ఫిబ్రవరి మూడో వారంలో నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. ఈ నియామక బాధ్యతలను పంజాయితీరాజ్ శాఖకు ప్రభుత్వం అప్పగించింది. పిబ్రవరి మూడో వారంలో నోటిఫికేషన్‌ను విడుదల చేసి, ఏప్రిల్ నెలలో రాత పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. మొత్తం 19 రకాల కేటగిరి ఉద్యోగాలకు 19 రకాల పరీక్షలను నిర్వహించనున్నారు.
అయితే, ఏపీలోని పశుసంవర్థక శాకలో 4765 అసిస్టెంట్ పోస్టులు, హార్టీకల్చర్‌లో 1005 అసిస్టెంట్ పోస్టులు, 990 సర్వేయర్ అసిస్టెంట్ పోస్టులు, 982 ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులు, 736 డిజిటల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను వెలువరించనున్నారు. పోస్టులకు సంబంధించి ఫిబ్రవరి మూడో వారంలో నోటిఫికేషన్లు వెలువడనున్న నేపథ్యంలో నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్‌తో పాటు వీలైనంత త్వరగా పరీక్షలు, రిజల్ట్ ప్రకటించి భర్తీలు చేస్తే బాగుంటుందని నిరుద్యోగులు చెబుతున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జగరనున్న నేపథ్యంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లు వెలువుడుతున్నాయి. గ్రామ సచివాలయంతో పాటు ఇతర శాఖలకు సంబంధించి కూడా ఉద్యోగాలకు నోటిఫికేషన్లను విడుదల చేయనున్నారు.