Show Cause: రోసా నిబంధనలకు విరుద్ధం..ప్రభుత్వ ఉద్యోగ సంఘాలకు షాక్!
AP Govt Show Cause: ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘానికి ఏపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో వారంలోగా చెప్పాలి అంటూ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. గవర్నర్ కు ఫిర్యాదు చేయటం రూసా నిబంధనలకు విరుద్ధమన్న ప్రభుత్వం ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయటానికి అనేక మార్గాలు ఉన్నా ఎందుకు ఉపయోగించుకోలేదని ప్రభుత్వం ప్రశ్నించింది. ఇక మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా నోటీసు జారీ చేశామన్న ప్రభుత్వం ఏడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసులో స్పష్టం చేసింది. ఇక మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం రోసా నిబంధనలకు విరుద్ధం అని అంటూ కూడా ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘానికి నోటీసులు జారీ చేసింది ప్రభుత్వం. జీతాలు ఒకటో తేదీ వేయడం సహా ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన వేల కోట్ల బకాయిలు ఇప్పించాలని కోరుతూ గవర్నర్ కు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత కేఆర్ సూర్యనారాయణ నేతృత్వంలో కొందరు ప్రతినిధులు కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై ఇతర ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర అభ్యంతరాలు కూడా వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో సదరు సంఘం మీద కోపంగా ఉన్న వైసీపీ సర్కార్ కేఆర్ సూర్యనారాయణకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశం అయింది.