AP Assembly Sessions: నేడు అసెంబ్లీలో వార్షిక బడ్జెట్
AP Assembly Sessions: నేడు అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి వార్షిక బడ్జెన్‌ను ప్రవేశ పెట్టనున్నారు. ఉదయం 10 గంటలకు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి. 10 గంటలకు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అనంతరం మంత్రి కాకాణి వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. కాగా, ఈరోజు ఉదయం 7 గంటలకు అసెంబ్లీలోని బుగ్గన కార్యాలయంలో బడ్జెట్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 8 గంటలకు కేబినెట్ మీటింగ్ జరగనున్నది. ఈ మీటింగ్‌లో బడ్జెట్‌ను ఆమోదించనున్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బడ్జెట్‌ను మంత్రి బుగ్గన ప్రవేశపెడతారు.
కాగా, ఈ వార్షిక సంవత్సరం రూ. 2.79 లక్షల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జగన్ సర్కార్ నేడు చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఈ బడ్జెట్‌లో మహిళా సంక్షేమం, నవరత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమానంగా ప్రాధాన్యత ఇవ్వనున్నారని సమాచారం. ఉద్యోగుల కోసం ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇక, అసెంబ్లీలో బడ్జెట్ పూర్తయ్యాక మండలిలో సాధారణ బడ్జెట్‌ను ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాష, వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి సిదిరి అప్పలరాజు ప్రవేశపెట్టనున్నారు.