AP Govt Good News: ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. ఆ డబ్బు ఖాతాల్లో పడ్డాయ్!
AP Govt Good News: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అక్కడి రైతులకు పండుగ పూట శుభవార్త చెప్పింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన నిధులను ప్రభుత్వం రైతుల అకౌంట్లో జమ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం రైతుల అకౌంట్లలో జమ చేసేందుకు గాను ఈ రోజు మొత్తం రూ.1500 కోట్లు విడుదల చేసింది. మొత్తంగా ఇప్పటివరకు ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో రూ.4,813 కోట్లు వేసింది. నిజానికి ఈ విడత మొత్తం 25.93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. ఇక రైతులకు మద్దతు ధర కల్పించడంతో పాటు కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులను ఏపీ ప్రభుత్వం వేగంగా చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 21 రోజులలోపు చెల్లించాలని నిర్ణయించుకున్నప్పటికీ ధాన్యం కొనుగోలు చేసిన వారం పది రోజుల్లోనే కొన్ని చోట్ల రైతుల ఖాతాలకు నగదును జమ చేస్తొంది. కొన్ని చోట్ల సాంకేతిక సమస్యల వల్ల ఆలస్యంగా జరుగుతున్నాయని అంటున్నారు. కొన్నాళ్ల క్రితం వరకు చెల్లింపులు సకాలంలో జరగకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతూ ఎక్కువ మంది రైతులు దళారులకు తమ ధాన్యాన్ని విక్రయించుకునే వారు. ప్రస్తుతం ఆర్బీకే(రైతు భరోసా కేంద్రం)ల ద్వాారా కొనుగోలు చేస్తున్న ధాన్యానికి వీలైనంత ఖాతాల్లోకి నగదు జమ అవుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.