Governor Biswa Bhusan : జీతభత్యాల ఆలస్యంపై ఆరా తీసిన గవర్నర్ బిశ్వభూషణ్
Governor Biswa Bhusan : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల్లో చీలికకు జగన్ సర్కారు ఎత్తుగడల పరంపర కొనసాగిస్తుందంటున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించకుండా పైపెచ్చూ వారి మధ్య విభేదాల్ని సృష్టిస్తూ, సమస్యల పక్కదారికి ఒడిగట్టింది అంటున్నారు. రూ.7 వేల కోట్ల డీఏలు ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది. గతంలో పీఆర్సీ సందర్భంలో ఉద్యోగులకు రూ.2,500 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, మార్చి 2022 నాటికి ఇస్తామని ప్రభుత్వమే చెప్పింది. ఇప్పటికీ ఆ బకాయిలు ఇవ్వలేదు. జీపీఎఫ్ అడ్వాన్సులు కూడా ఇవ్వకుండా దాట వేస్తుందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాల చెల్లింపులో ఆలస్యం చేస్తున్నారని ఉద్యోగ ప్రతినిదులు రెండు రోజుల కిందట గవర్నర్ బిశ్వభూషణ్ కి తమ సమస్యలను నింన్పించుకున్నారు. ఇందుకు సానుకూలంగా స్పందించారు గవర్నర్. ఉద్యోగ ఆందోళనపై కేంద్రం కదిలింది. పరిస్థితి ఆందోళనకరంగా మారుతోందని భావించి దిద్దుబాటు చర్యలకోసం రాష్ట్ర గవర్నర్‌ను రంగంలోకి దించినట్లు తెలిసింది.
శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిని రాజ్‌భవన్‌కు పిలిపించి మాట్లాడారు. ఉద్యోగులకు ఎన్నో చేశాం అని మీరు చెబుతున్నారు. మాకు అన్నింటా అన్యాయమే జరుగుతోందని వారు ఆవేదన చెందుతున్నారు. ఉద్యోగుల కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు తీసుకున్న నిర్ణయాలు ఎందుకు ప్రకటించలేదు అని ప్రశ్నించారు. ఇలాగైతే వ్యవస్థ ఎలా ముందుకు నడుస్తుందని ప్రశ్నించారు. ఉద్యోగుల్లోని ఆందోళనను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆ దిశగా వెళ్లాలని సూచించారని సమాచారం.