Drones for AP Farmers: ఏపీ రైతులకు డ్రోన్లు… వేగంగా శిక్షణ కార్యక్రమాలు
Drones for AP Farmers: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో కీలక మార్పులు తీసుకొస్తున్నది. ఇందులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. ఇప్పటికే రైతులకు అధునాతన వ్యవసాయ సామాగ్రిని అందజేసిన ప్రభుత్వం, తాజాగా వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైతులకు 2000 డ్రోన్లు అందించాలని నిర్ణయించింది. ఎంపిక చేసిన రైతలుకు ఇప్పటికే డ్రోన్ల వినియోగంపై శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణా కార్యక్రమాలనే వేగంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం, ఇప్పటి వరకు 500 మంది రైతులకు శిక్షణ ఇచ్చారు.
కాగా, ఈ 500 మందికి మొదటి విడతగా 500 డ్రోన్లను అందించనున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు కూడా ఇవ్వనున్నట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్ నెలలో రైతులకు డ్రోన్ల వినియోగంపై శిక్షణ ఇస్తున్నారు. ఈ కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా వేగంగా అమలు చేయాలని కూడా సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేయాలని, వారికి అధునాతన పరికరాలను అందజేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అధునాతన వ్యవసాయ పద్ధతుల ద్వారా వ్యవసాయం చేయడం వలన దిగుబడి అధికంగా వచ్చే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.