AP Government on CPS Issue: సీపీఎస్ పై ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం చర్చలు
AP Government on CPS Issue: చాలా కాలంగా సీసీఎస్ పై ఉద్యోగులు పోరాటం చేస్తున్నారు. కాగా, దీనిపై ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపేందుకు ఆర్థికశాఖ సిద్ధమైంది. విజయవాడలోని స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ కార్యాలయంలో ఈ చర్చలు జరపబోతున్నట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. దీనిపై ఇప్పటికే ఉద్యోగ సంఘాల నేతలకు సామాచారం అందించింది. ఈ చర్చల్లో రాష్ట్రానికి చెందిన 20 ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయసంఘాలు, సీపీఎస్ ఉద్యోగులకు సంబంధించిన అసోసియేషన్లు హాజరుకానున్నాయి. ఉద్యోగులకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించలేమని, ప్రస్తుతం సీపీఎస్ అంశంపై మాత్రమే చర్చించనున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. అయితే, సీపీఎస్ అంశంపై మాత్రమే చర్చించేందుకు రావాలని చెబుతున్నా, ఈ అంశంపై కూడా చర్చించే సమయంలో ఎలాంటి మెలికలు పెడుతుందోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.