AP Budget: సంక్షేమానికి ప్రాధాన్యత – ఏపీ బడ్జెట్ రూ 2.79 లక్షల కోట్లు
AP Finance Minister Buggana Presnets 2023-24 Budget in the Assembly: ఏపీ ఆర్దిక మంత్రి బుగ్గన 2023-24 రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారు. రూ. 2.79,79 లక్షల కోట్ల మేర బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పించారు. బడ్జెట్ ప్రసంగం ప్రారంభం కాగానే సభలో టీడీపీ సభ్యులు అందోళనకు దిగారు. దీంతో, స్పీకర్ వారిని ఒక రోజు సభ నుంచి సస్పెండ్ చేసారు. ఆ తరువాత మంత్రి బుగ్గన తన ప్రసంగం కొనసాగించారు. రానున్న ఆర్దిక సంవత్సరంలో ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా స్కీముల కోసం రూ 54228.36 కోట్లు కేటాయించారు. పెన్షన్లు – 21434 కోట్లు , రైతు భరోసా – 4020కోట్లు, జగనన్న విద్యా దీవెన – 2842 కోట్లు, జగనన్న వసతి దీవెన -2200కోట్లు, వైఎస్సార్ పీఎమ్ బీమా యోజన – 700 కోట్లు ప్రతిపాదించారు. రెవెన్యూ వ్యయం – 2,28,540 కోట్లు కాగా, మూల ధన వ్యయం – 31,061 కోట్లు గా బడ్జెట్ లే అంచనా వేసారు. రెవెన్యూ లోటు – 22,316 కోట్లు..ద్రవ్య లోటు – 54,587 కోట్లు గా మంత్రి బుగ్గన పేర్కొన్నారు. జీఎస్డీపీ లో రెవిన్యూ లోటు – 3.77 శాతం గా, ద్రవ్య లోటు – 1.54 శాతంగా పేర్కొన్నారు.
వ్యవసాయం -11,589 కోట్లు, పశు సంవర్ధక శాఖ – 1787 కోట్లు , బీసీ సంక్షేమం- 23,509 కోట్లు, పర్యావరణం – 685 కోట్లు, ఉన్నత విద్య – 2065 కోట్లు గా బడ్జెట్ అంచనాల్లో ప్రతిపాదించారు. ఇంధన శాఖ – 6546 కోట్లు, మాధ్యమిక విద్యా – 29, 691కోట్లు, అగ్రవర్ణ పేదల సంక్షేమం – 11,085 కోట్లు, సివిల్ సప్లై – 3725 కోట్లు, ఆర్ధిక శాఖ -72, 424 కోట్లు గా అంచనా వేసారు. జీఏడీ -1,148 కోట్లు, గ్రామ, వార్డు సచివాలయాలు -3,858కోట్లు ప్రతిపాదించారు. వైద్య, ఆరోగ్య శాఖ – 15,882 కోట్లు, హోం శాఖ -8, 206 కోట్లు, హౌసింగ్ -6292 కోట్ల మేర బడ్జెట్ లో శాఖల వారీగా ప్రతిపాదలు చూపించారు. ఇరిగేషన్ -11,908 కోట్లును ఈ బడ్జెట్ లో చూపించారు. ఇక, మౌలిక వసతులు, పెట్టుబడులు – 1295 కోట్లు, పరిశ్రమలు, వాణిజ్యం – 2602 కోట్లు ప్రతిపాదించిన ఆర్డిక మంత్రి..ఐటీ – 215 కోట్లుగా పేర్కొన్నారు.
డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు -300 కోట్లు, రైతులకు వడ్డీ లేని రుణాలు – 500 కోట్లు, కాపు నేస్తం – 550 కోట్లు, జగనన్న చేదోడు – 350 కోట్లు, వాహన మిత్ర- 275 కోట్లు, నేతన్న నేస్తం -200 కోట్లు, మత్స్యకార భరోసా -125 కోట్లు గా బడ్జెట్ లో ప్రతిపాదించారు. మత్స్యకారులకు డీజిల్ సబ్సిడి 50 కోట్లు, రైతులకు నష్టపరిహారం – 20 కోట్లు, లా నేస్తం – 17 కోట్లు, జగనన్న తోడు -35 కోట్లు, , బీసీ నేస్తం – 610 కోట్లు కేటాయించారు. వైఎస్సార్ కళ్యాణ్ మస్తు -200 కోట్లు, వైఎస్సార్ ఆసరా – 6700కోట్లు, వైఎస్సార్ చేయూత -5000కోట్లు, అమ్మ ఒడి -6500 కోట్లుగా బడ్జెట్ లో ప్రతిపాదించారు. సంక్షేమ రంగానికి భారీగా నిధుల కేటాయింపు చేసినట్లు స్పష్టం అవుతోంది. విద్య, వైద్య, ఇరిగేషన్, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు ఆర్దిక మంత్రి బుగ్గన తన ప్రసంగంలో పేర్కొన్నారు.